Begin typing your search above and press return to search.

మహిళలకు ఫన్.. మన్మథుడికి ఫ్రస్ట్రేషన్!

By:  Tupaki Desk   |   15 July 2019 6:51 AM GMT
మహిళలకు ఫన్.. మన్మథుడికి ఫ్రస్ట్రేషన్!
X
అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రోమోస్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో నాగ్ వయసుమళ్ళిన బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన లైఫ్ లో అమ్మ... అక్క చెల్లెళ్ళ సందడి ఫుల్లుగా ఉంటుంది. తాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో ఒక వైపు తన సిస్టర్స్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు నాగ్ తల్లిపాత్ర పోషించిన లక్ష్మిగారు రకుల్ తో ఏదో చెప్తూ ఉన్నారు. నాగ్ పై చాడీలు యమా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. ఇంకా ఇంకా చెప్పండి అన్నట్టుగా నవ్వుతూ మొహం పెట్టింది రకుల్. అయితే ఒక్క లేడీనే తట్టుకోలేం.. ఒక్క లేడి వల్లే రామాయణం జరిగింది. ఇక ఇంతమంది లేడీసును ఎలా తట్టుకోగలరు చెప్పండి? వారందరూ చుట్టూ చేరి వేధిస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. అందుకే నాగ్ కూడా ఫ్రస్ట్రేట్ అయినట్టుగా చేతులు పైకెత్తి పిడికిళ్లు బిగించి అదోరకం ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. అంటే మహిళలకు ఫన్.. మన్మథుడికి ఫ్రస్ట్రేషన్ అన్నమాట.

ఈ ఫ్రస్ట్రేషన్ నుండి మరి నాగ్ ఎలా బైటపడతాడో తెలియాలంటే మనం సినిమా రిలీజ్ వరకూ వేచి చూడక తప్పదు. ఎంత ఫ్రస్ట్రేట్ చేస్తున్నా ఈ సినిమా క్యాప్షన్ మాత్రం 'హి లవ్స్ వుమన్' అనే టాగ్ లైన్ ఇవ్వడం విశేషం. అందరినీ అలరించడానికి ఈ మన్మథుడు ఆగష్టు 9 న థియేటర్లలోకి రానున్నాడు.