నాగ్ లిప్ లాక్ చేసింది ఎవరితో?

Fri Jun 14 2019 12:27:00 GMT+0530 (IST)

అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'మన్మథుడు 2' టీజర్ ఈమధ్యే విడుదలైన సంగతి తెలిసిందే. మన్మథుడు ట్యాగ్ కు తగ్గట్టే అమ్మాయిలతో ఘాటు సరసాలాడడం థీమ్ కు జస్టిఫికేషనే.   పెళ్ళి లేట్ అయి బ్రహ్మచారిగా మిగిలిపోయిన నాగ్ ను తన కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా అక్కచెల్లెళ్ళు.. అమ్మ రెచ్చగొడితే నాగ్ కు పౌరుషం వచ్చి మన్మథుడిలా మారతాడు.  టీజర్ లో చూపించింది ఇది.అయితే టీజర్ లో లాస్ట్ డైలాగ్ "ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్" మాత్రం కొంతమందికి అర్థం అయినట్టు లేదు. అందుకే పెద్దగా విమర్శలు చెలరేగలేదు.  దానర్థం "నేను ప్రేమలో పడను. సెక్స్ మాత్రమే చేస్తాను" అని.  ఈ లెక్కన నాగ్ ప్రస్తుతం పీక్స్ లో ఉన్న బోల్డ్ సినిమాల ట్రెండ్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చినట్టే.  'మన్మథుడు' లో అమ్మాయిలను ద్వేషించే వ్యక్తిగా కనిపిస్తాడు.  ఇక్కడ సీక్వెల్ లో కుటుంబ సభ్యులు.. ఫ్రెండ్స్ వేధింపులు తాళలేక కాసనోవాగా మారి అమ్మాయిలతో గడపడమే పనిగా పెట్టుకున్న వ్యక్తిగా కనిపిస్తాడన్నమాట.   రకుల్ తో లవ్ సంగతి పక్కనపెడితే టీజర్ లో నాగ్ ఓ భామకు లిప్ లాకులు కూడా చేశాడు. మరి ఆ సుందరీమణి ఎవరు?

'మన్మథుడు 2' లో బెంగుళూరు బ్యూటీ అక్షర గౌడ ఒక క్యామియోలో నటించిందని గతంలోనే వార్తలు వచ్చాయి.  అక్షర కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అప్పట్లో కన్ఫాం చేసింది. మరి ఈ వయసుమళ్ళిన మన్మథుడు లిప్పు కిస్సులు లాగించిన భామ ఆ అక్షర గౌడ అని కొందరు అంటున్నారు.  ఏదైతేనేం.. లేటు వయసులో అక్కినేనివారి సరసాలు వెండితెరను వేడెక్కించడం.. సంచలనం సృష్టించడం మాత్రం ఖాయమే.  పనిలో పనిగా విమర్శలు చెలరేగే అవకాశాన్ని తోసిపుచ్చలేం.