Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బ్రహ్మాస్త్రలో నాగార్జున

By:  Tupaki Desk   |   16 July 2018 11:37 AM GMT
ఫోటో స్టోరీ: బ్రహ్మాస్త్రలో నాగార్జున
X
న్యాచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ తో చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ చేస్తున్న నాగార్జున తనకు ఇష్టమైన బాలీవుడ్ వైపు మళ్ళి అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్రలో నటిస్తున్న నాగార్జున అందులో కాస్ట్ అండ్ క్రూతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో పాటు సంజుతో ఇటీవలే అందరిని మెస్మరైజ్ చేసిన రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఎవరి పాత్రలు ఏంటి అనే వివరాలు బయటికి చెప్పడం లేదు కానీ బాహుబలి తరహాలో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందుతోంది. నమ్మశక్యం కానీ రీతిలో ఇందులో సన్నివేశాలు ఘట్టాలు ఉంటాయని ఊరిస్తోంది సినిమా యూనిట్. మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ స్క్రిప్ట్ ని అలాగే తీస్తారా లేదా బాహుబలి తరహాలో రెండు భాగాలకు కట్టుబడతారా అనే క్లారిటీ రావడం లేదు.

నాగార్జున కూడా ఇప్పటి దాకా దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ తెలుగు మీడియాతో కానీ తన ట్విట్టర్ లో కానీ షేర్ చేసుకోలేదు. దేవదాస్ లో మాత్రమే బిజీగా ఉన్నారనే అనుకున్నారు అందరు. ఇప్పుడు బ్రహ్మాస్త్రలో ఉన్నాడని ఖరారు అయ్యింది కాబట్టి ఉన్న కాస్త డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇంత భారీ కాన్వాస్ ఉన్న సినిమా ఈ ఏడాది రావడం లేదు. వచ్చే సంవత్సరం విడుదల ప్లాన్ చేస్తున్నారు. సో నాగ్ అకౌంట్ లో ఈ ఏడాది ఉండబోయేది దేవదాస్ ఒక్కటే. అమితాబ్ తో 90 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఖుదా గవా తర్వాత మళ్ళి ఇన్నాళ్లకు కలిసి నటిస్తున్నాడు నాగ్. మనంలో జస్ట్ ఒక సీన్ లో అమితాబ్ కనిపిస్తాడు కానీ అదేమి కౌంట్ లో వేసేది కాదు కాబట్టి బ్రహ్మాస్త మరోసారి కింగ్ నాగార్జునకు స్పెషల్ గా మిగలబోతోంది. అలియా భట్-మౌని రాయ్-దీపక్ తిజోరి-దివ్యేన్దు శర్మ-పరస్ అరోరా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న బ్రహ్మాస్త్ర సంగీత దర్శకుడు ప్రీతం కాగా ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 200 కోట్ల దాకా బడ్జెట్ తో తీస్తున్నట్టు ముంబై మీడియా టాక్.