Begin typing your search above and press return to search.

ఆఫీసర్ కోసం నాగ్ దిగాల్సివచ్చింది..

By:  Tupaki Desk   |   22 May 2018 2:30 PM GMT
ఆఫీసర్ కోసం నాగ్ దిగాల్సివచ్చింది..
X
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా కాలంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తే ఆ సినిమాకు రెస్పాన్స్ ఏ రేంజ్ లో అందుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నాగార్జునతో చేసిన ఆఫీసర్ సినిమాకు ప్రస్తుతం రెస్పాన్స్ పెద్దగా రావడం లేదు. ఎక్కువగా నెగిటివ్ లేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ సినిమా విడుదల అవుతోంది అంటే ఆ హంగామా మాములుగా ఉండదు. కానీ ఇప్పుడు అక్కినేని అభిమానులే సైలెంట్ గా ఉన్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా ఏరియల్ హక్కుల పంపిణి నాగార్జున హయాంలో జరిగాయని తెలుస్తోంది. ముందుగా నైజం ఏరియాల్లో వర్మ తన సొంతంగా రిలీజ్ చేసుకుంటుండగా.. కృష్ణాజిల్లాలో కామాక్షి కంబైన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. నాగార్జునకు సన్నిహితుడైన శివ ప్రసాద్ ఇంతకుముందు కేడి - దడ సినిమాలు చేసి దెబ్బ తిన్నాడు. మళ్లీ సినిమాలు చేయలేదు. అయితే నాగ్ మాటకు విలువ ఇచ్చి కృష్ణ ఏరియాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇక రెస్ట్ ఆఫ్ ఆంధ్రలో ప్రిన్స్ ఫిలిమ్స్ ద్వారా శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ముందుగా ఈ ఏరియల్ హక్కులు కొనడానికి వేరేవాళ్లు ముందుకు వచ్చినా వర్మ చెప్పిన రేట్లకు షాక్ అయ్యి నమస్తే అని వెళిపోయారట. దీంతోఈ నాగ్ రంగంలోకి దిగి అన్ని ఏరియాల్లో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నాడు. ఆఫీసర్ టీజర్ ట్రైలర్ పెద్దగా ఆసక్తికరంగా అనిపించడం లేదు. అందుకే సినిమా బిజినెస్ తక్కువైంది. మరి జూన్ 1న మొదటి ఆటకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.