Begin typing your search above and press return to search.

ఔను.. నాగ్ ఆ సినిమా చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   9 Feb 2016 11:30 AM GMT
ఔను.. నాగ్ ఆ సినిమా చేస్తున్నాడు
X
అక్కినేని నాగార్జునకు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్నందించింది ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా. అందులోని బంగార్రాజు క్యారెక్టర్ జనాలకు విపరీతంగా నచ్చేసి సినిమాకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. జనాలకు అంతగా కనెక్టయిన ఆ పాత్రను అలా ఊరికే వదిలేయకుండా ‘బంగార్రాజు’ పేరుతో ఓ సినిమా చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడీ విషయంలో ఓ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పేరు మీద ‘బంగార్రాజు’ అనే టైటల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించేశాడు కూడా. కాబట్టి ఈ ప్రాజెక్టు పక్కా అంటే పక్క అన్నమాట.

మరి ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదే తేలాల్సి ఉంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజు పాత్రను భలేగా డీల్ చేసి మంచి పేరు సంపాదించిన డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే ప్రస్తుతానికి రేసులో ముందున్నాడు. కాకపోతే మళ్లీ నాగ్, కళ్యాణ్ కలిస్తే కొత్తగా ఏం చేస్తారు అన్న సందేహాలు కూడా లేకపోలేదు. కాబట్టి వేరే దర్శకుడిని ఎంచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘ఊపిరి’ పూర్తి చేసే పనిలో నాగార్జున కొత్తగా ఏ సినిమాలూ కమిటవ్వలేదు. రాఘవేంద్రరావుతో ఓ భక్తిరస చిత్రం చేయాల్సి ఉన్నా.. ‘సోగ్గాడే’ లాంటి మాస్ హిట్ తర్వాత ఆ టైపు సినిమా కరెక్ట్ కాదేమో అని ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్లు కూడా వార్తలొస్తున్నాయి. కాబట్టి ‘బంగార్రాజు’ అతి త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.