Begin typing your search above and press return to search.

నాగ్ మళ్లీ అవకాశం ఇస్తాడా?

By:  Tupaki Desk   |   26 May 2018 5:30 PM GMT
నాగ్ మళ్లీ అవకాశం ఇస్తాడా?
X
2016 సంక్రాంతి కి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. నాగార్జున కెరీర్ లోనే ఆ సినిమా బిగెస్ట్ హిట్ గా నిలించింది. పైగా ఆ సినిమాలో నాగార్జున చేసిన పాత్రలు కూడా హైలెట్ అయ్యాయి. బంగార్రాజు క్యారెక్టర్ అయితే మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరికి నచ్చేసింది. ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు అంతగా గుర్తింపు తెచ్చుకుంది అంటే దర్శకున్ని మెచ్చుకొని తీరాల్సిందే.

ఓ కొత్త దర్శకుడు (కళ్యాణ్ కృష్ణ) నాగ్ ను ఈ లెవెల్లో చూపించాడా? అని సినీ దర్శకులే ఆశ్చర్యపోయారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే బంగార్రాజు క్యారెక్టర్ ని కొనసాగిస్తూ ఓ సినిమా చేసే అవకాశం ఉందని గతంలోనే నాగ్ చెప్పాడు. అయితే ఆ సినిమాలో నాగ చైతన్య కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్ లోనే నాగ్ సొంతంగా నిర్మించాలని అనుకుంటున్నాడు.

ఆ విషయం పక్కనపడితే ఇప్పుడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ను ఈ సారి నాగ్ నమ్ముతాడా లేదా అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే కళ్యాణ్ రీసెంట్ ఫిల్మ్ నేల టిక్కెట్టు పరిస్థితి ఏంటో మొదటి షోకే అర్థమైపోయింది. సినిమా డిజాస్టర్ అనే టాక్ రావడంతో కళ్యాణ్ కు మళ్లీ నాగ్ ఛాన్స్ ఇస్తాడా? అనే టాక్ మొదలైంది. నాగ్ ఎక్కువగా దర్శకుల్ని నమ్ముతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నా పెద్దా ప్లాప్ దర్శకుడు సక్సెస్ దర్శకుడు అనే లెక్కలు అస్సలు వేసుకోడు. మరి నేల టిక్కెట్టు రిజల్ట్ కింగ్ మైండ్ ని మార్చేస్తుందా లేదా చూడాలి?