నచ్చకపోతే రిలీజ్ చేయను -నాగార్జున

Thu Apr 20 2017 11:26:23 GMT+0530 (IST)

నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్ పూర్తయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాత నాగార్జున స్వయంగా అనౌన్స్ చేశారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో.. అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరాయన్నారు నాగ్.

'మూవీలో కీలకమైన నాలుగు కేరక్టర్లు బాగా వచ్చాయ్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ఎప్పుడూ ఫామ్ లోనే ఉంటాడు. ఈ సినిమాకి కూడా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. టెక్నీషియన్స్ లో చాలా మంది కొత్త వాళ్లయినా చాలా ప్యాషన్ తో పని చేశారు. బ్యాక్ గ్రౌండ్ లాంటివన్నీ వద్దు.. యాక్టింగ్.. ట్యాలెంట్ ముఖ్యం అనుకుంటాను. మూవీలో ఎమోషన్స్ కనిపిస్తే.. సినిమా బాగుంటుంది. కళ్యాణ్ కృష్ణ గురించి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో తనకే కాదు.. నాకు కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చాడు. బంగార్రాజు పాత్రను చూస్తే.. అతను పాత్రలను ఎలా డిజైన్ చేస్తాడో అర్ధమవుతుంది' అన్నారు నాగ్.

'కళ్యాణ్ కృష్ణ కేరక్టరైజేషన్ చాలా బాగుంటుంది. తెలుగుదనం. నేటివిటీ అతనికి బాగా తెలుసు. రా రండోయ్ లో కూడా ఇదే అంశం కనిపిస్తుంది. దర్శకుడితో కలిసి రోజూ ఎడిటింగ్ రూమ్ లో కూర్చుంటున్నాను. సినిమా బాగుంది కాబట్టే ప్రెస్ మీట్ పెట్టాను. మాకు నచ్చకుండా మాత్రం మేం సినిమా రిలీజ్ చేయం. మూడో వారంలో విడుదల చేయాలని చూస్తున్నాం' అంటూ రా రండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ కి రెడీ అయిందన్నారు నాగార్జున.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/