నాగ్ హిందీ మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

Tue Nov 13 2018 20:17:07 GMT+0530 (IST)

హీరో నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ బాలీవుడ్ స్టార్స్ అమితాబచ్చన్ - రణబీర్ కపూర్ - ఆలియా భట్ లతో పాటు పలువురు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున త్వరలో మరో షెడ్యూల్ లో నటించబోతున్నాడు.ఈ చిత్రం కథను సింగిల్ పార్ట్ లో తెరకెక్కించడం కష్టంగా ఉందని అందుకే ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారట. అందుకోసం స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న మార్పులు కూడా చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. రెండు పార్ట్ లలో కూడా నాగార్జున పాత్ర ఉంటుందట. భారీ బడ్జెట్ మూవీ అయిన బ్రహ్మస్త్ర చిత్రం ఛారిత్రాత్మక నేపథ్యంలో ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కథ గురించి ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు. కాని బాలీవుడ్ లో మాత్రం రకరకాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. రెండు పార్ట్ ల్లో మొదటి పార్ట్ ను వచ్చే ఏడాది చివర్లో అంటే క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక రెండవ పార్ట్ ను 2020 లో విడుదల చేస్తారట. ఈ చిత్రం రెండు పార్ట్ లుగా రూపొందుతున్న నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్రాన్ని పోలి ఉంటుందా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.