Begin typing your search above and press return to search.

మామా కోడలు సర్ఫ్‌, సబ్బుతో సంపాదిస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Feb 2019 9:11 AM GMT
మామా కోడలు సర్ఫ్‌, సబ్బుతో సంపాదిస్తున్నారు
X
చందమామ సినిమాలో ఆహుతి ప్రసాద్‌ ఒక డైలాగ్ చెప్తాడు. టీవీలో కజరారే పాట వస్తున్నప్పుడు దాన్ని చూసి.. ఫ్యామిలి ఫ్యామిల సబ్బులు, సవరాలు అమ్ముకుంటూ తెగ సంపాదించేస్తున్నారు అంటాడు. అప్పట్లో బచ్చన్‌ కు, ఐశ్వర్యారాయ్‌ కు ఆ రేంజ్‌ లో యాడ్స్‌ ఉండేవి. ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇప్పుడు ఇదే లిస్ట్‌ లోకి వస్తారు కింగ్‌ నాగార్జున, ఆయన కోడలు సమంత. ఇద్దరూ కలిసి సర్ఫ్‌ లు, సబ్బులు అమ్ముకుంటూ డబ్బులు తెగ వెనకేసుకుంటున్నారు.

నాగార్జున ఘడీ డిటర్జెంట్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌. రెండేళ్లనుంచి నాగ్‌ కు సంబంధించిన యాడ్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత సంస్కారవంతమైన xxx బట్టల సోప్‌ కి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఎంపికైంది. ఎంపిక అవ్వడమే కాదు.. ఆల్‌ రెడీ టీవీల్లో యాడ్స్‌ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీరిద్దరి యాడ్స్‌ టీవీల్లో పక్కపక్కనే వస్తున్నాయి. దీంతో మామ చెప్పిన సర్ఫ్‌ కొనాలా, కోడలు చెప్పిన సబ్బు కొనాలా అని తెగ ఇబ్బంది పడుతున్నారు. మామా కోడళ్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. సినిమాలు, సబ్బులతో రెండు చేతులో ఆర్జిస్తున్నారు.

యాడ్స్‌ మాత్రమే కాదు.. సినిమాల్లో కూడా నాగార్జున, సమంత ఇద్దరూ బిజీనే. నాగ్‌ మన్మథుడు 2 సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. సమంత మజిలీ రిలీజ్‌ కు రెడీగా ఉండగా.. శర్వానంద్‌ తో 96 సినిమా చేస్తోంది. ఇక చైతూ, అఖిల్‌ కూడా వారి వారి సినిమాల్లో బిజీగా ఉంది. సో.. ఫ్యామిలి ఫ్యామిలీ సినిమాలు, యాడ్స్‌ తో ఫుల్‌ బిజీగా ఉన్నారు.