Begin typing your search above and press return to search.

నాగ్‌-నాని సినిమా... సెల్ఫీతో మొదలైంది

By:  Tupaki Desk   |   24 Feb 2018 11:29 AM GMT
నాగ్‌-నాని సినిమా... సెల్ఫీతో మొదలైంది
X
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్స్‌లో శ్రీరామ్ ఆదిత్య ఒక‌రు. అత‌ని సినిమాలు ఇంత‌వ‌ర‌కు బాగున్నాయ‌న్న మెచ్చుకోలు త‌ప్ప‌... క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కొ్ట్టిందిలేదు. అందుకే ఇప్పుడొక భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌కి శ్రీకారం చుట్టాడు. మ‌ల్టీస్టార‌ర్ మూవీలో నాగ్ - నానీని ఒకే స్క్రీన్‌పై చూపించ‌బోతున్నారు.

శ్రీరామ్ ఆదిత్య గతంలో భ‌లే మంచిరోజు, శ‌మంత‌క మ‌ణి సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ రెండు సినిమాలు ఫ‌ర్వ‌లేద‌నిపించాయి కానీ హిట్ కొట్టలేదు. ఒక మంచి క‌థ రాసుకుని నాని, నాగార్జున‌కు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాల‌న్న‌ది శ్రీరామ్ ఆశ‌యం. ఆ సినిమా లాంఛ‌నంగా ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ రోజు నానీ పుట్టిన‌రోజు కూడా కావ‌డంతో... ఇదే రోజు సినిమాను ప్రారంభించారు. కాగా నాగార్జున త‌ప్ప మిగ‌తా అంద‌రూ సినిమా ప్రారంభోత్స‌వానికి వ‌చ్చారు. అంద‌రూ క‌లిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం నాగార్జున వ‌ర్మ‌తో క‌లిసి శ‌ప‌థం మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అందుకోసం ముంబైలో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అతి త్వ‌ర‌గా ఆ ప్రాజెక్టుకు పూర్తి చేసుకుని మ‌ల్టీస్టార‌ర్ మూవీ షూటింగ్ లో ఆయ‌న పాల్గొంటాడు. ఈ సినిమాలో నాగ్ డాన్‌గా న‌టిస్తుంటే... నానీ డాక్ట‌రుగా క‌నిపించ‌బోతున్నాడు. మ‌ణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. మ‌రో హీరోయిన్ ని ఫైన‌లైజ్ చేయాల్సి ఉంది.