Begin typing your search above and press return to search.

నాగ్, కార్తీ.. గాల్లో ఎగిరిపోతున్నారు

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 AM GMT
నాగ్, కార్తీ.. గాల్లో ఎగిరిపోతున్నారు
X
పారిస్ షూటింగ్ లో ఉన్న ఊపిరి టీం.. అక్కడి షెడ్యూల్ కి సంబంధించిన చివరి సీన్ షూట్ కంప్లీట్ చేసేశారు. వీళ్లు చేసిన లాస్ట్ షాట్ ఏంటో తెలుసా? వేల అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసి.. పారాచూట్ వేసుకుని ల్యాండ్ అయిపోవడం అంతే. సాధారణంగా ఇలాంటి రిస్కీ సీన్స్ కోసం స్టార్ హీరోలకు బదులుగా డూప్ లతో పని కానిచ్చేస్తారు.

కానీ నాగ్ - కార్తీ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఊపిరిలో ఈ సీన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. మూవీకి కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కావడంతో.. డూప్ లతో చేయించే ముగించేందుకు అంగీకరించలేదు ఈ ఇద్దరు. జస్ట్ రెండు రోజుల ట్రైనింగ్ తో పారా గ్లైడింగ్ చేసేశారు. బాడీ డూప్స్ లేకుండా.. సొంతం చేయడంతో మూవీకి కీలకమైన ఈ సీన్ చాలా అద్భుతంగా వచ్చిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

ఫ్రెంచ్ ఎమోషనల్ డ్రామా ది ఇన్ టచబుల్స్ ను... తెలుగు ప్రేక్షకులకు అనువుగా ఊపిరి పేరుతో తీస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. నాగ్ మాజీ ప్రేమికురాలిగా అనుష్క గెస్ట్ రోల్ చేస్తుండగా.. కార్తీ సరసన తమన్నా యాక్ట్ చేస్తోంది. గాబ్రియెల్లా డిమాట్రిడ్స్ మరో కీలక పాత్రలో కనిపించనుంది.