Begin typing your search above and press return to search.

వామ్మో!! నాగ్‌ అంతగా మునిగిపోయాడే

By:  Tupaki Desk   |   28 May 2016 9:32 AM GMT
వామ్మో!! నాగ్‌ అంతగా మునిగిపోయాడే
X
అక్కినేని నాగార్జున ఇప్పుడు వరుసగా కాన్సెప్టు ఓరియెంటెడ్‌ కమర్షియల్‌ సినిమాలతో హిట్లు కొడుతున్నాడు. మనం అండ్‌ ఊపిరి ఆ కోవకే చెందుతాయి. మధ్యలో సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాతో కూడా రచ్చ చేసేశాడు. అయితే ఈ సినిమాల పరంపర కొనసాగిస్తూనే.. సడన్‌ గా ''హాథీ రామ్‌ బాబా'' జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు కూడా.

అయితే ప్రస్తుతం వర్క్ నుండి కాస్త బ్రేక్ తీసుకుని హాలిడేయింగ్‌ చేస్తున్న నాగార్జున.. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అక్కడి నుండి మనకు ఏమన్నా మోడ్రన్ వెస్ర్టన్‌ విషయాలేవైనా చెబుతారేమో అనుకుంటే.. ఆయనకు క్వీన్స్ అనే న్యూయార్క్ రాష్ట్రంలోని పట్టణంలోని ఉన్న వినాయకుడి గుడి బాగా నచ్చిందట. అక్కడి పరిశుభ్రత అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. అంతే కాదు.. గెడ్డం పెంచుకుని ఉన్న నాగ్‌ ను చూస్తే..ఆయన పూర్తిగా పాత్రలో మునిగిపోయాడని ఇట్టే అర్ధమైపోతోంది.

గతంలో కూడా సాయిబాబా సినిమా చేసినప్పుడు.. తెల్లటి గెడ్డం పెంచుకుని.. కింగ్‌ నాగార్జున ఇలాగే పాత్రలో ఒదిగిపోయాడు. షూటింగ్ పూర్తయ్యి సినిమా రిలీజయ్యేవరకు ఆ పాత్రలోనుండి బయటకు రాలేదు. వామ్మో.. 50+ ఏజ్ లోనూ నాగ్‌ డెడికేషన్‌ చూశారా? కుర్ర హీరోలూ.. ఓ లుక్కేసుకోండి నానా..