Begin typing your search above and press return to search.

రకుల్ ఎందుకు హానికరం??

By:  Tupaki Desk   |   23 May 2017 8:04 AM GMT
రకుల్ ఎందుకు హానికరం??
X
‘‘అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం’’.. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ట్రైలర్ చివరలో హీరో నాగచైతన్య చెప్పిన ఈ డైలాగ్ జనాలందరికీ బాగానే కనెక్టయింది. సోషల్ మీడియాలో ఈ మాట బాగానే వినిపిస్తోంది. నాగచైతన్య ఉడ్ బీ సమంతను కూడా ఇదే ప్రశ్న అడిగేశారు... అమ్మాయిలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం అని... అయితే ఆ మాట తనను ఉద్దేశించి చెప్పింది కాదంటూ సమంత సింపుల్ గా ఓ మాటతో దానిని పక్కన పెట్టేసింది. మొత్తానికి సినిమా విడుదల కాకముందే ఈ డైలాగ్ బాగా పేలింది.

‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పల్లెటూరి అమ్మాయి భ్రమరాంబ పాత్రలో కనిపించనుంది. ఇంతవరకు మోడ్రన్ గర్ల్ పాత్రల్లోనే కనిపించిన రకుల్ తొలిసారి ఈ తరహా క్యారెక్టర్ చేసింది. ట్రైలర్ లో చూపించిన విధానం మేరకైతే ఇది భ్రమరాంబ కాస్త టిపికల్ క్యారెక్టరే. అందుకే హీరో పాత్రధారి నాగచైతన్య విసిగి వేసారిపోయి అమ్మాయిలు హానికరమనే స్టేట్ మెంట్ వదిలాడు. ఈ సినిమా మే 26న రిలీజవుతుంది కాబట్టి ఎందుకలా అన్నాడో అప్పటికి తెలిసిపోతుంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్నానంటూ రకుల్ తాజాగాి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీనికి అల్లు శిరీష్ ‘వెయిటింగ్ భ్రమరాంబ.. వెయిటింగ్’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

పనిలో పనిగా అల్లు శిరీష్.. రకుల్ ను ఓ ప్రశ్నడిగేశాడు ‘నువ్వు ఆరోగ్యానికి ఎందుకు హానికరం? తెలుసుకోవాలని ఉందని’. దీనికి రకుల్ కూడా ‘నేనైతే లీస్ట్ హానికరం.. భ్రమరాంబ అయితే చూడాలి’ అంటూ చాలా తెలివిగా బదులిచ్చింది. శిరీష్ తో పాటు చాలామంది వెయిట్ చేస్తున్నారు భ్రమరాంబ ఎందుకు హానికరమో తెలుసుకోవాలని.