Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్' పై నాగబాబు ప్రభావం ఎంత?

By:  Tupaki Desk   |   15 Jan 2019 1:30 AM GMT
ఎన్టీఆర్ పై నాగబాబు ప్రభావం ఎంత?
X
మెగా బ్రదర్ నాగబాబు ఏ ముహూర్తాన బాలక్రిష్ణతో పెట్టుకున్నాడో కానీ ఆ వివాదం మాత్రం రగులుతూనే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ విడుదల సందర్భంగా నాగబాబు కామెంట్స్ పై బాలయ్య స్పందించలేదు. అది తన సినిమాకు మైనస్ అవుతుందని ఊరుకున్నారు.

ఇప్పుడు బాలయ్య తీసిన ‘ఎన్టీఆర్’.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్2’ మూవీలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఇందులో బ్లాక్ బస్టర్ హిట్ గా ఎఫ్2 నిలవగా.. బాలయ్య ‘ఎన్టీఆర్’ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఇదే విషయంపై ఇటీవల నాగబాబు స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు చూపించలేదని.. సినిమా బాగా లేదంటూ దుయ్యబట్టారు.

ఈ మెగా బ్రదర్ నాగబాబు వర్సెస్ బాలయ్య వివాదంతోనూ ఎన్టీఆర్ బయోపిక్ కు దెబ్బపడిందని ఇండస్ట్రీలో చెబుతున్నారు.. నాగబాబు వరుస వీడియోల వల్ల మెగా అభిమానులు అస్సలు ఎన్టీఆర్ బయోపిక్ ను చూడలేదు. నెగెటివ్ టాక్ కూడా ప్రచారం చేశారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ వైపు మెగా అభిమానులు వెళ్లకుండా నాగబాబు కీలక పాత్ర పోషించాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయినా కంటెంట్ ఉన్నోళ్లకు కటౌట్ అవసరం లేదంటారు. ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ తో పోలిస్తే.. ‘ఎఫ్2’ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో హిట్ అయ్యిందని చెప్పవచ్చు. నాగబాబు అన్నంత మాత్రానా ప్రేక్షకులు చూడకపోవడం.. ఫ్లాప్ చేయడం అన్నది వట్టిమాటగానే చెప్పవచ్చు.