శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్ పై నాగబాబు కౌంటర్

Mon Apr 15 2019 11:50:00 GMT+0530 (IST)

తెలుగు బుల్లితెరపై నంబర్ 1 షోగా విరాజిల్లుతున్న ‘జబర్ధస్త్’లో కళ తప్పింది. ఏపీలో ఎన్నికల వేడి అంటుకోవడం.. జబర్ధస్త్ ఇద్దరు జడ్జీలు నాగబాబు - రోజాలు.. జనసేన - వైసీపీ నుంచి పోటీచేస్తుండడంతో వారు ప్రచార బిజీలో ఉన్నారు. జబర్ధస్త్ లో పాల్గొనలేదు. దీంతో ఈటీవీ యాజమాన్యం శేఖర్ మాస్టర్ - మీనాలతో ప్రస్తుతానికి షో నడిపిస్తోంది. అయితే నాగబాబు - రోజాలను చూసిన జనాలు అడిక్ట్ అయిపోయారు.  వీళ్ల స్థానంలో శేఖర్ మాస్టర్  - మీనాలను చూసేసరికి ఓన్ చేసుకోలేకపోతున్నారు. కళ తప్పిన జబర్ధస్త్ కు మళ్లీ నవ్వుల నాగబాబు - జోష్ రోజా కావాలంటున్నారు..ఒకవేళ నరసాపురం ఎంపీగా పోటీచేసిన నాగబాబు గెలిస్తే ఇక జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పేస్తారేమోనన్న టెన్షన్ ఆ షో అభిమానులను వెంటాడింది. దీనిపై తాజాగా నాగబాబు సమాధానమిచ్చారు. తాను నరసాపురంలో ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా మంది ఎంపీగా గెలిచినా జబర్ధస్త్ షో మానకండి అని కోరారని.. అందుకే ఈ కార్యక్రమం వదలను అంటూ క్లారిటీ ఇచ్చారు. జబర్ధస్త్ లాంటి కార్యక్రమానికి జడ్జ్ గా ఉండడం కూడా సమాజసేవలాంటిదేనని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మాకు పారితోషికం ఒకటి ఎక్స్ ట్రాగా అందుతుంది అని సమాధానమిచ్చారు. అయినా జబర్ధస్త్ కు కేవలం నెలలో 5 రోజుల సరిపోతుందని.. ఆదివారాల్లో కానియేచ్చు అని వివరించారు. అయితే ఎంపీగా గెలిస్తే జబర్ధస్త్ చేస్తాను కానీ.. సినిమాల్లో మాత్రం నటించను అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

ఇక శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ పై కూడా నాగబాబు స్పందించారు. నరసాపురంలో నాగబాబును ఓడించాలని శివాజీరాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో నాగబాబు మాట్లాడారు. శివాజీరాజా కామెంట్లను లైట్ తీసుకున్నారు. రెండేళ్లు శివాజీ రాజా చేసిన పనులు నాకు సంతృప్తినివ్వలేదని.. అందుకే నరేష్ ప్యానెల్ కు తాను సపోర్ట్ చేశానని.. మార్పు ఉండాలనే ఇలా చేశానని చెప్పుకొచ్చారు.  శివాజీరాజా ఆరోపించిన చిన్న చిన్న విషయాలపై కాకుండా పెద్ద పెద్ద విషయాలపై తాను పోరాటం చేస్తానని నాగబాబు కౌంటర్ ఇచ్చారు..