Begin typing your search above and press return to search.

మెగా బ్రదర్ వద్దన్నారు!

By:  Tupaki Desk   |   20 Nov 2018 4:57 PM GMT
మెగా బ్రదర్ వద్దన్నారు!
X
క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మిస్తూ నటిస్తున్న ఎన్టీఆర్ షూటింగ్ నిర్విఘ్నంగా సాగుతోంది. క్రిష్ సెట్ చేసుకున్న ఆర్టిస్ట్ సెలక్షన్ తో పాటు ప్రమోషన్ విషయంలో అందరి కంటే ముందుండటం బిజినెస్ పరంగా ప్లస్ హైప్ కోణంలోనూ బాగా హెల్ప్ అవుతోంది. ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి సుప్రసిద్దులుగా పేరు తెచ్చుకున్న పాత్రలు ఇందులో చాలా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే అందరిని పాపులారిటీ ఉన్న వాళ్లనే సెట్ చేసుకున్న క్రిష్ కు ఒక్క ఎస్వి రంగారావు గారికి మాత్రం సరైన ఆప్షన్ దొరకలేదట.

నాగబాబు కోసం ట్రై చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని తెలిసింది. నాగబాబు రూపం ఆహార్యం ఎస్వి రంగారావు గారికి సూట్ అయ్యేలా ఉంటుంది. కానీ మరి ఏ కారణంతో నో చెప్పారో తెలియదు కాని అది మరొకరికి లైఫ్ ఇచ్చేంత ప్లస్ అయ్యింది. ఎంతో అన్వేషణ చేసి ఇక లాభం లేదని క్రిష్ నాటక రంగంలో బాగా అనుభవం ఉన్న ఒక స్టేజి ఆర్టిస్టుని ఎస్విఆర్ పాత్ర కోసం సెట్ చేసుకున్నాడట. ఆ మేరకు సన్నివేశాలు చిత్రీకరించాక అనుకున్న దాని కన్నా అవుట్ పుట్ బాగా రావడంతో క్రిష్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని టాక్.

ఇది కనక క్లిక్ అయితే అతనికి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని సన్నిహితులతో అన్నట్టు టాక్. కథానాయకుడులో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. జనవరి 9న రిలీజ్ కానున్న కథానాయకుడితో పాటు మహానాయకుడి బిజినెస్ దాదాపు పూర్తయిందని వినికిడి. సంక్రాంతి బరిలో ముందుగా దూకబోతున్న బాలయ్య దానికి తగ్గట్టే ప్రమోషన్ విషయంలో కూడా అడ్వాన్సుగా ఉన్నాడు. వినయ విధేయ రామ-ఎఫ్2-పెట్టాలతో బాక్స్ ఆఫీస్ ఫైట్ టఫ్ గానే ఉండబోతోంది.