Begin typing your search above and press return to search.

అరవింద సమేతలో ఆ పాత్ర హైలెట్

By:  Tupaki Desk   |   20 Jun 2018 11:30 AM GMT
అరవింద సమేతలో ఆ పాత్ర హైలెట్
X
టాలీవుడ్ లో ఈ దసరాకు రానున్న సినిమాల్లో ఎన్టీఆర్ అరవింద సమేత ఒకటి. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడం కష్టం. ఫ్లాప్ తో ఉన్న దర్శకుడు అయినప్పటికీ త్రివిక్రమ్ కసి మీద ఉన్నాడని చెప్పవచ్చు. ఆకలి మీద ఉన్న పులి జింక కోసం ఉన్నట్లు ఆయన కూడా హిట్టు కోసం వెయిట్ చేస్తున్నారు. పట్టారు అంటే మాములుగా ఉండదు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అరవింద సమెత రికార్డులు బద్దలు కొడుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్ర అందరి మనసులను తాకుతుందని తెలుస్తోంది. నాగబాబు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన పాత్ర సినిమాకే హైలెట్ అని టాక్. ఎందుకంటే నాగబాబు పాత్ర ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ తొ కూడుకున్నది. త్రివిక్రమ్ ఆ పాత్ర కోసం కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ రాశారట. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్స్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. చాలా కాలం తరువాత నాగబాబు ఒక మంచి పాత్రలో కనిపించడానికి అవకాశం దొరికింది.

ఇక అరవింద సమేత సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేకులు లేకుండా స్పీడ్ గా నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో టీజర్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందట. ఈ సినిమాలో తారక్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు.