ఈ ఏడాది నిహారిక పెళ్లి.. నో క్యాస్ట్ బార్!

Mon Feb 11 2019 10:48:30 GMT+0530 (IST)

సోషల్ మీడియా టీవీ చానెళ్ల లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కుమార్తె నిహారిక పెళ్లి గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి నాగబాబు రిప్లయ్ ఆసక్తికరం. తన కుమార్తె నిహారికకు వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంచి అబ్బాయి అయితే చాలని అతని కులం మతంతో సంబంధం లేదని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన నిహారిక పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తానని నిహారికకు ముందే చెప్పానని తన కోరిక తీర్చడం కోసమే సినిమాల్లో నటిస్తానంటే అంగీకరించానని నాగబాబు అన్నారు. సినిమాల్ని పక్కన పెట్టి వెబ్‌సిరీస్‌లలో నటిస్తే చాలని అంటే దానికి తను కూడా ఓకే చెప్పిందని అన్నారు. నిహారికకు బయటి సంబంధాలు చూస్తున్నాం. మంచి అబ్బాయి కుదిరితే వెంటనే పెళ్లి చేసేయాలనుకుంటున్నాం. మంచి అబ్బాయి అయితే కులం మతం విషయంలో మాకు పట్టింపులేమీ లేవు అని నాగబాబు స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

2018 వరకు నిహారికకు సమయం ఇచ్చాం. ఇది పూర్తయింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మా కులంలో మంచి అబ్బాయి దొరికితే ఓకే. లేదంటే ఇతర కులాల్లోని వారైనా మంచి గుణం వున్న వ్యక్తు తారసపడితే తప్పకుండా అతనికిచ్చి పెళ్లి చేస్తాను. ఆ విషయాంలో మాకుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఖరాకండిగా చెప్పారు. సినిమాల ఎంపిక విషయంలో నిహారిక ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. తను సినిమాల్లో నటించే సమయం అయిపోయిందని ఇక పెళ్లి చేస్తానని అసలు విషయం చెప్పేశారు మెగా బ్రదర్. మరి నిహారిక వెర్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.