Begin typing your search above and press return to search.

చరణ్‌ లా వరుణ్‌ కు అదృష్టం కలిసి రాలేదు

By:  Tupaki Desk   |   10 Dec 2018 6:02 AM GMT
చరణ్‌ లా వరుణ్‌ కు అదృష్టం కలిసి రాలేదు
X
మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇస్తున్న హీరోల్లో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉంటున్నారు. అయితే రామ్‌ చరణ్‌ - అల్లు అర్జున్‌ ల తర్వాత వచ్చిన వారు మాత్రం స్టార్‌ స్టేటస్‌ ను బలంగా అందిపుచ్చుకోలేక పోతున్నారు. ఆ ఇద్దరి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్‌ ఇతర మెగా వారసుల సినిమాలకు రావడం లేదు. తాజాగా ఈ విషయమై నాగబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తన కొడుకు కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ గురించి నాగబాబు మాట్లాడుతూ... చరణ్‌ సినీ ఎంట్రీ గ్రాండ్‌ గా జరిగింది. మంచి బ్యానర్‌ - మంచి సినిమాతో చరణ్‌ కు అదృష్టం కలిసి వచ్చింది. కాని వరుణ్‌ కు మాత్రం అంత అదృష్టం కలిసి రాలేదు. చరణ్ చిరంజీవి గారి అబ్బాయి కనుక ఎక్కువ ప్రాముఖ్యత, అదే వరుణ్ చిరంజీవి తమ్ముడి కొడుకు కనుక అవకాశాలు తక్కువే అన్నాడు. అందుకే వరుణ్ ను చరణ్ తో పోల్చడం ఎప్పటికీ కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. వరుణ్‌ ఎంట్రీ కోసం పెద్ద బ్యానర్‌ లతో చర్చలు చేశాం. అశ్వినీదత్‌ మొదట వరుణ్‌ ను పరిచయం చేయాలని అనుకున్నాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆయనకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత కూడా పలువురు పెద్ద నిర్మాతలను సంప్రదించినా కూడా కుదరలేదు. వరుణ్‌ మొదటి సినిమాకు క్రిష్‌ దర్శకత్వం చేయాల్సి ఉంది. కాని అది సాధ్యం కాలేదు. అలా వరుణ్‌ తేజ్‌ ఎంట్రీ చివరకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఠాగూర్‌ మదు - బుజ్జిల నిర్మాణంలో ఇచ్చాడు.

ప్రస్తుతం వరుణ్‌ బాగానే సంపాదిస్తున్నాడు. అతడి సంపాదన ముందు నాది తక్కువే. అయినా కూడా ఇప్పటికి పాకెట్‌ మనీ నానుండే తీసుకుంటాడు. ఇక కథల ఎంపిక విషయంలో వరుణ్‌ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అతడి సినిమాల విషయంలో నా ఇన్వాల్వ్‌ మెంట్‌ అస్సలు ఉండదు. కథ ఫైనల్‌ అయిన తర్వాత ఒక సారి నాకు వినిపిస్తాడు. అంతకు మించి నాకు వరుణ్‌ సినిమాలో ఎలాంటి ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉండదు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.