సమంత బ్యాచిలర్ పార్టీ రచ్చే

Sat Sep 23 2017 22:50:58 GMT+0530 (IST)

టాలీవుడ్ క్యూట్ ప్రేమ జంటగా గుర్తింపు తెచ్చుకున్న సమంత - నాగచైతన్య అందరిలా కాకుండా లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. వీరిద్దరూ ఒకటైనప్పటి నుండి ఏంతో హ్యాపీగా అనేక రకాలుగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా పార్టీలకు అయితే లెక్కలేదు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా సమంత చైతును అస్సలు మిస్ అవ్వదు. వారం గ్యాప్ వచ్చినా తనకు కాబోయే శ్రీవారి ముందు వాలిపోతుంది.సాధారణంగా ప్రతి ఒక్కరు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. అయితే కొందరు పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతారు. మరి అలా అనుకుందో ఏమో గాని  ముందుగానే అమ్మడు బ్యాచిలర్ పార్టీని తన ఆత్మీయులకు ఇచ్చేసింది. చైతూతో కలిసి సమంత తన స్నేహితులకు పార్టీని ఇచ్చింది. అంతే కాకుండా పార్టీలో కొన్ని పోటోలను కూడా దిగారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో సమంత ఎంత సెక్సీగా ఉందో.. నాగ చైతన్య అంత హాటుగా ఉన్నాడు. అంతే కాకుండా పార్టీకి విచ్చేసిన శిల్పా రెడ్డి వంటి ఆత్మీయులు కూడా పిచ్చ హాటుగా ఉన్నారంతే.

వచ్చే నెల గోవాలో వీరి పెళ్లి ఇరు సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు జరగబోతోంది. ఇప్పటికే పెళ్లి కోసం ఇరు కుటుంబాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అక్టోబర్ 6న హిందు సంప్రదాయం ప్రకారం - అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్ధతుల్లో సమంత -నాగ చైతన్య ఒక్కటి కాబోతున్నారు. ఇక ఈ పెళ్లికి నాగ్ ఆత్మీయులు మాత్రమే వస్తున్నారని టాక్.