కోలీవుడ్ లో శౌర్యం చూపిద్దామని..

Fri May 19 2017 12:11:05 GMT+0530 (IST)

స్టార్ హీరోలు మార్కెట్ విస్తరించుకునేందుకు ద్విభాషా చిత్రాలను రూపొందించడం ఇప్పుడు ట్రెండ్ అయిపోతోంది. స్టార్ హీరోయిన్స్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఇలాగే తెరకెక్కుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ యంగ్ హీరోస్ కు కూడా పాకుతోంది. ట్యాలెంటెడ్ పెర్ఫార్మర్ అని పేరు తెచ్చుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ఇప్పుడు ఓ బై లింగ్యువల్ మూవీకి రెడీ అవుతున్నాడు.

సినిమాలతోను.. తన పాత్రతోను ప్రయోగాలు చేసేందుకు.. తనను తాను నిరూపించుకునేందుకు నాగశౌర్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అవకాశం వస్తే ఎలాంటి క్లిష్టమైన పాత్రనైనా చేసేందుకు రెడీ అనే ఈ కుర్రాడు.. ఇప్పుడు కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ను ఒడిసిపట్టుకున్నాడని తెలుస్తోంది. విజయ్ తో తలైవా.. తమన్నాతో అభినేత్రి వంటి చిత్రాలను రూపొందించిన ఏ ఎల్ విజయ్(అమలా పాల్ మాజీ భర్త) దర్శకత్వంలో ఓ మూవీకి ఒప్పుకున్నాడట నాగ శౌర్య. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ వినగానే తన కేరక్టరైజేషన్ నచ్చేసి.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

ఏఎల్ విజయ్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం ఖచ్చితంగా తన కెరీర్ కు ప్లస్ అని భావిస్తున్నాడట నాగ శౌర్య. త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుండగా.. రజినీకాంత్ తో 2.0 వంటి భారి చిత్రాన్ని రూపొందిస్తున్న లైకా ప్రొడక్షన్స్.. ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/