Begin typing your search above and press return to search.

ఛలో.. నాలుగు కోట్లు అంటున్నాడుగా..

By:  Tupaki Desk   |   20 March 2018 5:00 AM GMT
ఛలో.. నాలుగు కోట్లు అంటున్నాడుగా..
X
యంగ్ హీరో నాగశౌర్య గత ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇప్పటికి ఈ హీరోకు చలో రూపంలో సరైన సక్సెస్ చిక్కింది. ఈ కుర్రాడిలో ట్యాలెంట్ కి లోటేమీ లేదు కానీ.. ఇప్పటివరకూ టైం కలిసిరాలేదంతే. పేరు తీసుకొచ్చే సినిమాలు తప్ప.. వాటిని వసూళ్లుగా మార్చే కమర్షియల్ సక్సెస్ అందడానికి లేట్ అయింది.

ఇప్పుడు నాగశౌర్య ఖాతాలో బ్లాక్ బస్టర్ పడడంతో డిమాండ్ తెగ పెరిగిపోతోంది. పలువురు దర్శకులు.. నిర్మాతలు.. నాగశౌర్యతో సినిమా చేసేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఉగాది సందర్భంగా తన కొత్త సినిమా నర్తనశాలను లాంఛ్ చేసేసి.. షూట్ మొదలుపెట్టేసినట్లు చెప్పాడు నాగశౌర్య. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. అద్భుతమైన కామెడీతో అలరిస్తానని అంటున్నాడు ఈ హీరో. మరోవైపు భవ్య క్రియేషన్స్ బ్యానర్ తో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడట. ఇప్పటికే అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

మజ్ను ఫేమ్ విరించి వర్మ రీసెంట్ గా ఓ కథ వినిపించాడట. కొత్త దర్శకులు ఎక్కువగా ఈ హీరోను అప్రోచ్ అవుతున్నారట. ప్రస్తుతం తన టైమ్ నడుస్తోందనే విషయాన్ని గ్రహించిన నాగశౌర్య.. సడెన్ గా తన పారితోషికాన్ని 4 కోట్ల రూపాయలకు పెంచేశాడని అంటున్నారు. ముద్దొచ్చినపుడే చంకెక్కాలి.. క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలి కాన్సెప్ట్ ను వంటబట్టించుకున్నాడని అంటున్నారు సినిమా జనాలు.