Begin typing your search above and press return to search.

శౌర్య @ మోడరన్ బృహన్నల

By:  Tupaki Desk   |   24 May 2018 11:49 AM GMT
శౌర్య @ మోడరన్ బృహన్నల
X
ఛలోతో నిఖార్సైన హిట్ కొట్టిన శౌర్య అదే ఊపులో రేపు విడుదల కానున్న అమ్మమ్మగారిల్లు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఫక్తు ఫామిలీ సినిమా కాబట్టి ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమాతో ఉన్నాడు. దానికి తోడు ట్రైలర్ కూడా ఆ అంచనాలకు తగ్గట్టే ఉండటంతో కుర్రాడి నమ్మకం గట్టిదే అనుకోవచ్చు. కానీ అది ఎంత వరకు నిజమవుతుంది అనేది రేపు తేలుతుంది. ఛలో నిర్మించిన తన స్వంత బ్యానర్ ఐరా ప్రొడక్షన్స్ లో నాగ శౌర్య @ నర్తనశాల అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే ప్రోగ్రెస్ లో ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టైటిల్ లో సూచించినట్టు నాగ శౌర్య ఇందులో గే తరహా పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ఎప్పుడు అమ్మాయిల చుట్టే తిరుగుతూ అమ్మాయిలా ప్రవర్తించే నాగ శౌర్య క్యారెక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేసినట్టు తెలిసింది.

మరి దీని కోసం నాగ శౌర్య రెగ్యులర్ గెటప్ లో కనిపిస్తాడా లేక పాత నర్తనశాలలో సీనియర్ ఎన్టీఆర్ లాగా మీసాలు తీసేసి ఉంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజానికి ఈ కథ కొందరు హీరోల దగ్గరికి వెళ్ళినప్పుడు హీరో పాత్రలోని ఈ వేరియేషన్ వల్లే ఒప్పుకోలేదట. కానీ శౌర్య మాత్రం రిస్క్ చేసి నటిస్తున్నాడు. ఈ మధ్య యూత్ హీరోలు చేయటం లేదు కానీ ఒకప్పుడు చంటబ్బాయ్ లో చిరంజీవి టాప్ హీరోలో బాలకృష్ణ లావారీస్ లో అమితాబ్ బచ్చన్ ఇలాంటి పాత్రలో అలా తళుక్కున మెరిసినవాళ్ళే. సో కథలో విషయం ఉంటే కనక అదే హై లైట్ అవుతుంది. హిందీ సినిమాల్లో ఇవి సర్వసాధారణం కానీ మనవాళ్ళు ఇమేజ్ అంటూ అభిమానులు అంటూ లెక్కలు వేస్తూ రిస్క్ చేయడానికి ఇష్టపడరు. మరి శౌర్య చేస్తున్నాడు కాబట్టి ఇది కనక సక్సెస్ అయితే మరికొందరికి స్ఫూర్తిగా నిలవొచ్చు.