Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే కి రాబోతున్న ప్రేమజంట

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:13 AM GMT
వాలెంటైన్స్ డే కి రాబోతున్న ప్రేమజంట
X
నాగ చైతన్య - సాయి పల్లవి లతో శేఖర్ కమ్ముల ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ని లాక్ చేసేసారని తెలుస్తుంది. ప్రస్తుతం మొదటి షెడ్యుల్ లో ఉన్న ఈ సినిమా మరో రెండు షెడ్యుల్స్ లో టోటల్ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అంటే డిసెంబర్ కల్లా సినిమా రెడీ అన్నమాట.

జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఎలాగో జనవరి లో స్పేస్ లేదు పైగా ఫిబ్రవరి 14 ఈ సినిమాకు పర్ఫెక్ట్ డేట్ కావడంతో అదే డేట్ కి ఫిక్సయ్యారట. సినిమాలో లవ్ సీన్స్ అలాగే సాయి పల్లవి డాన్స్ - చైతూ డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయట.

నిజానికి అక్కినేని హీరోలంటేనే లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్. మరి ఈ లవ్ స్టోరీతో చైతూ మరో సూపర్ హిట్ అందుకొని లవర్ బాయ్ అనిపించుకుంటాడెమో చూడాలి. ఈ సినిమాకు రెహమాన్ దగ్గర పనిచేసిన పవన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఫిదా లాగే ఈ సినిమాకు కూడా సాంగ్స్ ప్లస్ కాబోతున్నాయని ఇన్సైడ్ టాక్.