Begin typing your search above and press return to search.

లవర్స్‌ డేకు అక్కినేని కపుల్‌ గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   13 Feb 2019 1:30 AM GMT
లవర్స్‌ డేకు అక్కినేని కపుల్‌ గిఫ్ట్‌
X
నాగచైతన్య - సమంతలు పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి నటిస్తున్న 'మజిలీ' చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'నిన్ను కోరి' చిత్రంతో దర్శకుడిగా విమర్శల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఒక మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత మరియు నాగచైతన్యలు చాలా సింపుల్‌ లుక్‌ లో కనిపిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. సమంత లుక్‌ మరియు నాగచైతన్య ఇద్దరితో ప్రేమ వ్యవహారం సాగించడం ఇలా 'మజిలీ' కథ ఊహకు అందని విధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం టీజర్‌ ను ఈనెల 14న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయబోతున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని కపుల్‌ నాగచైతన్య - సమంత వ్యాలంటైన్స్‌ డే సందర్బంగా తమ సినిమా టీజర్‌ ను అభిమానులకు గిఫ్ట్‌ గా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కాబోతుంది. సమ్మర్‌ 'మజిలీ' చిత్రంతో ప్రారంభం కాబోతుంది. గత సమ్మర్‌ ప్రారంభంలో వచ్చిన 'రంగస్థలం' మరియు 'భరత్‌ అనే నేను' చిత్రం మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.