చెయ్-శామ్ పెళ్లి లొకేషన్ మారిందా?

Wed Apr 19 2017 10:26:52 GMT+0530 (IST)

అక్కినేని నాగచైతన్య- సమంత.. వీరిద్దరి గురించిన ప్రతీ సమాచారాన్ని జనాలు బాగా ఫాలో అయిపోతున్నారు. ఈ ఇద్దరి సినిమాల గురించి బోలెడంత ఆసక్తి ఉన్నా.. ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారనే టాపిక్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా పట్టించుకుంటున్నారు. వీళ్ల పెళ్లిపై ఓ లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది.

చైతు-సమంతలు ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది అక్టోబర్ లోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారట. అది కూడా హైద్రాబాద్ లోనే చెయ్-శామ్ ల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. బాలి.. బ్యాంకాంక్.. లలో ఒక ప్రాంతంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారనే టాక్ వచ్చింది కానీ.. చివరకు హైద్రాబాద్ లో పెళ్లికే ఫిక్స్ అయ్యారట. అభిమానులు.. ఫ్రెండ్స్.. రిలేషన్స్.. ఇండస్ట్రీ జనాలు.. అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసి.. పెళ్లి వేడుకలకు రెడీ అయిపోతారట చైతన్య- సమంత.

రా రండోయ్ వేడుక చూద్దాం మూవీని నాగ చైతన్య ఫినిష్ చేస్తుండగా.. సమంత చేతిలో రామ్ చరణ్ మూవీ.. రాజు గారి గది2 ఉన్నాయి. ఈ రెండు పూర్తి చేసి.. కెరీర్ కి బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత మళ్లీ యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసేలా ఈ జంట ప్లాన్ చేసుకున్నారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/