Begin typing your search above and press return to search.

చైతు అండ్ సాం-లవ్ ఫర్ ఎవర్

By:  Tupaki Desk   |   17 March 2018 12:34 PM GMT
చైతు అండ్ సాం-లవ్ ఫర్ ఎవర్
X
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో అందమైన జంట ఏది అంటే నాగ చైతన్య, సమంతాల పేరే గుర్తుకువస్తుంది. అంత బాగా అందరికి మనసుల్లోకి చొచ్చుకుపోయిన ఈ జంట త్వరలో మరోసారి వెండితెరపై కనువిందు చేయనుంది. సాధారణంగా పెళ్ళయ్యాక హీరొయిన్లకు అవకాశాలు తగ్గడం అనేది సర్వ సాధారణం. కాని సమంతా కేస్ మాత్రం రివర్స్ లో వెళ్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గించకుండా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూనే ఉంది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే నాగార్జున అమలను ప్రేమ వివాహం చేసుకున్నాక ఇద్దరు కలిసి సినిమాల్లో నటించలేదు. అమల పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పారు. పెళ్లికి ముందు చిరంజీవితో రాజా విక్రమార్క వెంకటేష్ తో అగ్గి రాముడు చేసారు. ఇక అవి అయ్యాక నటనకు పూర్తిగా దూరమై ఫ్యామిలీకి అంకితమయ్యారు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. చైతు సాంలు చాలా ప్లానింగ్ తో కెరీర్ ను పొడిగించుకునే పనిలో ఉన్నారు. పైన ఫోటో చైతు తన ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ మరోసారి తామిద్దరూ కలిసి నటించబోయే సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఇప్పటి దాకా ఈ జంట మూడు సినిమాల్లో కనిపించారు. ఏ మాయ చేసావే బాక్స్ ఆఫీస్ ను సైతం మాయలో పడేయగా ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయ్యింది. మనం మర్చిపోలేని హిట్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగో సారి శివ నిర్వాణ దర్శకత్వంలో మరోసారి వెండితెరపై ఒకటి కాబోతున్నారు. నిన్ను కోరి లాంటి సెన్సిటివ్ ఎమోషనల్ లవ్ స్టొరీ తో మెప్పించిన శివ ఈ జంటతో కొత్త సినిమా చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. ప్రేయసి అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కాని అది మారే అవకాశాలు ఉన్నాయి. మరోసారి చైతు సాం చేయబోయే మేజిక్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు