Begin typing your search above and press return to search.

చై అండ్ సాం - హాలిడే ప్లాన్

By:  Tupaki Desk   |   25 March 2018 5:19 AM GMT
చై అండ్ సాం - హాలిడే ప్లాన్
X
పెళ్ళైతే చేసుకున్నారు కాని మరుక్షణం నుంచే ఊపిరిసలపనంత బిజీగా ఉన్నారు నాగ చైతన్య, సమంతా. వివాహం జరిగే టైంకే ఇద్దరు విడివిడిగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పీక్ స్టేజిలో ఉండటంతో బ్రేక్ తీసుకోలేని పరిస్థితి. అందుకే రెండు వారాల జాలీ ట్రిప్ కోసం ఇద్దరు అమెరికా వెళ్లినట్టు తాజా సమాచారం. సినిమా ప్రపంచానికి దూరంగా ఓ పదిహేను రోజులు ఏకాంతాన్ని ఎంజాయ్ చేసి రావాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. రంగస్థలం - మహానటి సినిమాల్లో తన పాత్ర పూర్తి చేసుకున్న సమంతా కన్నడ యు టర్న్ రీమేక్ కూడా కొంత భాగం చేసేసింది. మరోపక్క చైతు సవ్యసాచి కోసం కొంచెం బాలన్స్ వర్క్ తప్ప షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ఇప్పుడున్న ఒప్పుకున్న కొత్త సినిమాల ప్రకారం చైతుకు మరో ఏడాది దాకా విరామం లేనట్టే.

మారుతీతో చేస్తున్న శైలజా రెడ్డి గారి అల్లుడు - వెంకటేష్ తో బాబీ దర్శకత్వంలో మల్టీ స్టారర్ - శివ నిర్వాణ దర్శకుడిగా ఒక సినిమా ఇలా వరసబెట్టి ఒప్పుకున్న చైతు గ్యాప్ రాదని ముందే ఊహించి ఇప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. సమంతా కూడా రాగానే యు టర్న్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. హీరో ఉండని ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేసే పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. విశాల్ తో నటించిన ఇరుంబు తిరై డబ్బింగ్ వెర్షన్ 'అభిమన్యుడు' ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. తమిళనాడు సమ్మె పూర్తి కాగానే విడుదలకు రెడీ అవుతుంది. చైతుతో శివ నిర్వాణ సినిమాలో హీరొయిన్ గా సమంతా ఈపాటికే ఓకే కాగా బాబీ మూవీలో కూడా తననే తీసుకునే ప్రతిపాదన ఉందనే వార్త ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. ఈ ట్రిప్ పూర్తయ్యాక వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.