అక్టోబర్ 6న.. గోవాలో మెగా మ్యారేజ్

Fri May 19 2017 00:23:06 GMT+0530 (IST)

మెగా మ్యారేజ్ అంటే ఇదేదో మెగా ఫ్యామిలీలో జరిగే మ్యారేజ్ అనుకునేరు. కాదండీ బాబు. ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఓ హీరో అండ్ హీరోయిన్ 'మెగా' మ్యారేజ్ కోసమే అని మనందరికీ తెలిసిందే. చాన్నాళ్ళపాటు ప్రేమించుకుని.. ఇరు ఫ్యామిలీలో పెద్దలని ఒప్పించి.. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ ద్వారా తమ పెళ్ళికి రెడ్ కార్పెట్ వేసుకున్నారు. ఎవరో లైట్ వెలిగిందా? ఇంకెవరు మన అక్కినేనీసే!!

ఎప్పటినుండో అందరినీ ఊరిస్తున్న ఆ మెగా విషయం ఏంటంటే.. అసలు లవ్ బర్డ్స్ నాగచైతన్య అండ్ సమంత ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే. మొత్తానికి ఇద్దరూ కూడా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆల్రెడీ నాగార్జున కూడా తన కోడలు పిల్ల గురించి తెగ చెప్పేసుకుంటూ మురిసిపోతున్నారు. అందుకే ఈ ఇద్దరూ ఏడడుగులు వేసేదెప్పుడూ.. రింగులు మార్చుకునేదెప్పుడూ.. అంటూ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ వెయిటింగ్ చేస్తున్నారు మరి. ఇకపోతే ఇప్పుడు వీరి పెళ్ళి గురించి ఒక కొత్త విషయం తెలిసింది.

నిజానికి అక్టోబర్ నెలలో బ్యాంకాక్ లోనో బాలి ఐల్యాండ్ లోనో సమంత-చెయ్ ల పెళ్ళి అని మొన్నటివరకు రూమర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న కబురు ఏంటంటే.. అక్టోబర్ 6న గోవాలో బీచ్ సాక్షిగా వీరి మెగా వెడ్డింగ్ జరగనుందట. ఈ విషయంపై ఇంకా అక్కినేనీస్ ఎవ్వరూ ఏం చెప్పలేదు కాని.. కేవలం ఎంగేజ్మెంట్ కే సమంత ప్రత్యేకపమైన చీరలు నేయించినట్లు.. ఇప్పుడు పెళ్ళికోసం కూడా భారీగానే ప్రణాళికలు రచించిందట. అలాగే చైతన్య కూడా అందరినీ సర్పరైజ్ చేయడానికి పెద్దగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. లెటజ్ సీ.. ఈ కొత్త డేట్ రూమర్లో ఎంతవరకు నిజం ఉందో!!