‘మంచోడు’ కాబోతున్న నాగచైతన్య

Thu Sep 14 2017 09:56:26 GMT+0530 (IST)

భలే భలే మగాడివోయ్.. బాబు బంగారం.. మహానుభావుడు లాంటి క్యాచీ టైటిళ్లతో జనాల్ని ఆకర్షించిన దర్శకుడు దాసరి మారుతి. అతను తన తర్వాతి సినిమాకు ఇలాంటి మరో క్యాచీ టైటిల్ పెట్టినట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి చేయబోయే సినిమాకు ‘మంచోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ చిత్రాన్ని నిర్మించబోయే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ టైటిల్ ను ఇప్పటికే రిజిస్టర్ కూడా చేయించినట్లు సమాచారం.

ఇటీవలే ‘యుద్ధం శరణం’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న చైతూకు.. తర్వాత చేయబోయే సినిమాలు కీలకం. అతను చందూ మొండేటితో ‘సవ్యసాచి’ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే నెలలో మొదలుపెట్టి.. ఆ తర్వాత మారుతి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో ఈ చిత్ర షూటింగ్ ఆరంభమవుతుంది.

ఈ చిత్రంలో సమంత కథానాయిక అని ఊహాగానాలు వచ్చాయి కానీ.. చైతూ ఖండించాడు. ‘ప్రేమమ్’ తర్వాత ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో చైతూ చేయబోయే సినిమా ఇది. మారుతి స్టయిల్లో పక్కా ఎంటర్టైనర్లా ఈ చిత్రం ఉంటుందంటున్నారు. ఇక ‘సవ్యసాచి’ యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రయోగాత్మక చిత్రం.  ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. చైతూ చేయబోయే రెండు సినిమాలకూ ఇంకా కథానాయిక ఖరారవ్వలేదు.