‘యుద్ధం శరణం’ వాయిదా

Sat Aug 12 2017 16:15:08 GMT+0530 (IST)

ఏం జరిగిందో ఏమో.. ఆగస్టు 24కు అనుకున్న అక్కినేని నాగచైతన్య సినిమా ‘యుద్ధం శరణం’ ఆ తేదీ నుంచి వాయిదా పడిపోయింది. ఈ చిత్రాన్ని రెండు వారాలు ఆలస్యంగా సెప్టెంబరు 8న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. ఆగస్టు చివరి వారంలో ‘అర్జున్ రెడ్డి’ తప్ప వేరే సినిమా ఏదీ లేదు. ఆ సినిమాకు క్రేజ్ ఉన్నప్పటికీ దాన్ని మరీ పెద్ద పోటీగా ఏమీ భావించాల్సిన పని లేదు. చైతూ సినిమా వస్తే అదే ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ అవుతుంది.

అయినా మంచి డేటును ఎందుకు వదిలేస్తున్నారో ఏమో మరి. బహుశా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఆ సమయానికి సినిమా రిలీజ్ చేయడం కష్టమవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబరు తొలి వారంలో బాలయ్య ‘పైసా వసూల్’ వస్తుండగా.. రెండో వారంలో మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’.. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇందులో మనోజ్ సినిమా పక్కా. రోహిత్ మూవీ డౌట్ అంటున్నారు. ‘యుద్ధం శరణం’పై మంచి అంచనాలే ఉన్న నేపథ్యంలో ‘ఒక్కడు మిగిలాడు’కు ఇబ్బందే.

ఆగస్టు 24 నుంచి ‘యుద్ధం శరణం’ వెళ్లిపోవడం ‘అర్జున్ రెడ్డి’కు తీపి కబురే. ఇప్పటికైతే వేరే చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఆ ఆ వీకెండ్ కు షెడ్యూల్ అయి లేవు. ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం సోలోగా రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశముంది. 25న ‘అర్జున్ రెడ్డి’ రాబోతుండగా.. ముందు రోజు తమిళ డబ్బింగ్ మూవీ ‘వివేకం’ వస్తుంది. దాని వల్ల ‘అర్జున్ రెడ్డి’కి వచ్చిన ఇబ్బందేమీ లేదు.