Begin typing your search above and press return to search.

చైతూ.. అంత ఫేవరెట్ అయిపోయాడా

By:  Tupaki Desk   |   14 Feb 2016 11:30 AM GMT
చైతూ.. అంత ఫేవరెట్ అయిపోయాడా
X
తన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్యకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాలని చాలా ఆరాట పడ్డాడు అక్కినేని నాగార్జున. కానీ ఆ విషయంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఐతే మాస్ ఇమేజ్ రాకున్నా.. కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు చైతూ. స్టార్ హీరోల్లో వారసుల్లో ఎవరికీ లేని విధంగా ‘లవర్ బాయ్’ ఇమేజ్ సంపాదించుకుని.. కెరీర్‌ ను బాగానే నడిపిస్తున్నాడు. చైతూ గత సినిమా ‘దోచేయ్’ పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ అతడికి అవకాశాల విషయంలో కొదవే లేదు. మంచి మంచి దర్శకులు అతడితో సినిమాలు చేయడానికి ఆరాటపడుతున్నారు. క్రేజీ ప్రాజెక్టులు అతడి తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల మీద కూడా మంచి అంచనాలున్నాయి.

గౌతమ్ మీనన్ లాంటి విలక్షణ దర్శకుడితో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేస్తూనే.. మరోవైపు టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ‘ప్రేమమ్’ రీమేక్ ‘ప్రేమమ్’లోనూ నటిస్తున్నాడు చైతూ. మరోవైపు ‘లౌక్యం’ - ‘డిక్టేటర్’ సినిమాల దర్శకుడు శ్రీవాస్ తన తర్వాతి సినిమాను చైతూతో చేయాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికే ఓ మంచి స్క్రిప్టు తయారు చేసుకుని రెడీగా ఉన్నాడట శ్రీవాస్. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో పరిచయమైన కళ్యాణ్ కృష్ణ కూడా చైతూతో సినిమా కోసం ఆశపడుతున్నాడు. నాగ్ ఆల్రెడీ అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కూడా. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో ఫామ్ లోకి వచ్చిన హరీష్ శంకర్ కళ్లు కూడా చైతూ మీద పడ్డట్లు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా చైతూను ఓ కథకు కన్సిడర్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఓ ఫ్లాప్ తర్వాత కూడా చైతూ ఇంతగా దర్శకుల దృష్టిలో ఉండటం.. అతడికి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు వస్తుండటం విశేషమే.