Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో క్రికెట్ ఆట‌

By:  Tupaki Desk   |   24 July 2018 4:17 AM GMT
అక్కినేని హీరో క్రికెట్ ఆట‌
X
అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్ స్వింగ్‌ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి రెండు సినిమాల్లో న‌టిస్తూ ఉర‌క‌లెత్తిస్తున్నాడు. స‌వ్య‌సాచి - శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాలు రిలీజ్ వార్‌ లోకి దిగిపోతున్నాయ్‌. ఈ రెండిటిలో ఒక‌టి మాస్ మ‌సాలా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. వేరొక‌టి అత్త‌తో రివెంజ్‌ స్టోరి కం రొమాంటిక్ ల‌వ్‌స్టోరి. రెండిటి చిత్రీక‌ర‌ణ‌లు ఇప్ప‌టికే దాదాపు పూర్త‌య్యాయి. సైమ‌ల్టేనియ‌స్‌ గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగిస్తున్నారు. ఈలోగానే త‌దుప‌రి సినిమాని నిన్న‌టిరోజున సైలెంటుగా మొద‌లెట్టేశాడు. ఈసారి క్రేజీగా వైఫ్‌ స‌మంత‌తో క‌లిసి చైతూ జోడీ క‌డుతున్నాడు.

ఈ సినిమాలో నాగ‌చైత‌న్య పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుందిట‌. చైతూ ఓ క్రికెట‌ర్‌ గా న‌టించ‌నున్నాడు. క్రికెట్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెలుగులో ప్ర‌యోగాత్మ‌కంగా రానున్న క్రేజీ సినిమా ఇద‌ని చెబుతున్నారు. క్రికెట‌ర్‌గా రాణించాలంటే అందుకు ప్రాక్టీస్ అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఆ ప‌నిలోనే ఉన్నాడ‌ట అక్కినేని బుల్లోడు. వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా అన్న‌పూర్ణ స్టూడియోస్‌ లో ప్రాక్టీస్ చేస్తాడ‌ట‌. మ‌రోవైపు ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌కుడు శివ‌ నిర్వాణ చెబుతున్నారు. నాగ‌చైత‌న్య - స‌మంత జోడీ కొత్త‌గా క‌నిపిస్తుంద‌ని అత‌డు చెబుతున్నాడు. సామ్ న‌టించిన `యూట‌ర్న్‌` నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది. సెప్టెంబ‌ర్‌ లో వినాయ‌క చ‌వితి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. అదే రోజు శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న న‌టించిన‌ త‌మిళ చిత్రం `సీమ రాజా` కూడా రిలీజ్ కానుంది.