Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: చై సవ్యసాచి సూపర్బ్

By:  Tupaki Desk   |   22 Nov 2017 10:38 AM GMT
ఫస్ట్ లుక్: చై సవ్యసాచి సూపర్బ్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోల్లో నాగ చైతన్య ఒకరు. అయితే అతనికి కరెక్ట్ కథ తగలేకపోవడంతో తండ్రి స్థాయిని అందుకోలేకపోతున్నాడు. ప్రేమమ్ - రారండోయి వేడుక చూద్దాం సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్న చైతు ఆ వెంటనే సొంత నిర్ణయంతో హ్యాట్రిక్ కొట్టాలని యుద్ధం శరణం అనే సినిమాను తీశాడు. కానీ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని ఈ అక్కనేనికి వారసుడు తనకు ప్రేమమ్ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో ఒక కొత్త తరహా కథతో రాబోతున్నాడు. సవ్యసాచి అనే ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల సెకండ్ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే నవంబర్ 23న నాగ చైతన్య బర్త్ డే సందర్బంగా చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రి మూవీ మేకర్స్ వారు చైతు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ లో చైతు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. గత సినిమాల్లో ఎప్పుడు కనిపించని విధంగా ఇంటెన్స్ లుక్ తో ఉండడం సినిమాకు పాజిటివ్ టాక్ ను తెచ్చేలా ఉంది. సవ్యసాచి సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని దర్శకుడు చెప్పలేదు గాని సినిమా మాత్రం కొత్త కంటెంట్ తో రాబోతోందని టైటిల్ తోనే చెప్పేస్తూ అంచనాలను పెంచేస్తున్నాడు. మరి ఆ స్థాయిలో డైరెక్టర్ చందు అంచలనాలను అందుకుంటాడో లేదో చూడాలి.