సవ్యసాచి నుండి అటెళ్ళిపోయాడు

Fri Apr 20 2018 23:00:01 GMT+0530 (IST)

నాగచైతన్య పెళ్లయ్యాక చాలా బిజీ అయిపోయాడు. వరుసపెట్టి సినిమాలు ఒప్పుకున్నాడు. సామ్ ఎనర్టీ చైతూకు కూడా వచ్చినట్టుంది సినిమాలు చేయడంలో దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం సవ్యసాచి షూటింగ్ ముగించుకున్నాడు నాగ చైతన్య. ఆ సినిమా షూటింగ్ పూర్తయి బయటపడడంతో కాస్త ఊపిరి పీల్చుకుని తరువాతి సినిమాకు సిద్ధమైపోయాడు.మళయాళంలో హిట్ కొట్టిన సినిమా ప్రేమమ్. అదే పేరుతో చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ ఆ సినిమాను చేశాడు. సున్నితమైన ప్రేమ కథను చక్కగా తెరకెక్కించాడంటూ చందూ మొండేటికి ప్రశంసలు దక్కాయి. అందుకే తరువాతి సినిమా సవ్యసాచిని కూడా అతని దర్శకత్వంలోనే చేశాడు చైతూ. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా- మాధవన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎలాంటి బ్రేక్ లేకుండా  జరిగిపోయింది. అంతకుముందే మారుతితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు చైతూ. అదే శైలజా రెడ్డి అల్లుడు. సవ్యసాచి అయితే కానీ మారుతి సినిమా పట్టాలెక్కదు. అందుకే త్వరగా సవ్యసాచి షూటింగ్ పూర్తి చేసుకున్నాడు చైతూ. నేటితో సవ్యసాచి షూటింగ్ పార్ట్ ముగిసిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జూన్ 14న సినిమా విడుదలకు సిద్ధం చేయడమే మిగిలింది.

సవ్యసాచి షూటింగ్ అయ్యాక ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్‌కు వెళ్లనున్నాడు చైతూ. ఇది వినోదంతో కూడి కుటుంబకథాచిత్రమని తెలుస్తోంది. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తోంది. ఇప్పటికే నాగార్జునతో పలు సినిమాలలో జతకట్టింది రమ్య. తాజాగా సోగ్గాడే చిన్ని నాయనాలో కూడా భార్యగా నటించింది. ఇప్పుడు నాగ్ కొడుకు చైతూకు అత్తగా నటించబోతోంది. ఇక హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది.