కూతురితో అల్లుడి సరసవిరసాలు

Sat Aug 11 2018 09:12:41 GMT+0530 (IST)

సరసరసవిరసాల్లో చైతూ తెగ ముదిరిపోతున్నాడు. తాత ఏఎన్నార్ - డాడ్ నాగార్జునను మించిపోతున్నాడు. మా హీరో అల్ట్రా రొమాంటిక్ అని అక్కినేని అభిమానులు ఏనాడో ఫిక్సయిపోయారు. `ఏమాయ చేశావే` చిత్రంతోనే రొమాంటిక్ గయ్ గా బోలెడంత మాయ చేశాడు చై. ఆ సినిమాతో వచ్చిన గాళ్ ఫ్యాన్స్ ఇప్పటికీ అతడిని ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ తర్వాతా సమంతతో వరుస సినిమాల్లో చైతూ రొమాన్స్ వర్ణనాతీతం. అందుకే అతడికంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం చైతన్య బ్యాచిలర్ లైఫ్ ని వదిలేసి - సమంతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సరిగ్గా పెళ్లి తర్వాత.. ఇలాంటి వేళ అతడు అసలు సిసలు రొమాంటిక్ అల్లుడిగా నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పైగా రమ్యకృష్ణ అలియాస్ శైలజారెడ్డి అల్లుడిగా ఆటాడుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈనెల 31న శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ కోసం కోటానుకోట్ల అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. దసరాబుల్లోడులా అలరిస్తాడా?  లేక అల్లరి అల్లుడిలా చెలరేగుతాడా? అంటూ ఎవరి లెక్కల్లో వాళ్లు మునిగి తేల్తున్నారు.

సరిగ్గా ఇలాంటి వేళ ఇదిగో ఈ రొమాంటిక్ ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. అత్త కూతురితో చైతూ అదిరిపోయే రొమాన్స్ చేస్తున్నాడు. బబ్లీ డాటర్ అనూ ఇమ్మాన్యుయేల్ ని మా బాగానే ముగ్గులోకి దించినట్టు ఈ ఫోటోలు చూస్తేనే తెలిసిపోతోంది. చైతన్య కెరీర్ లోనే నెవ్వర్ ఎవ్వర్ అన్న తీరుగా ఈ రొమాన్స్ పండిందని అర్థమవుతోంది. అనూతో అల్లుడు అలా అడ్వాన్స్ అయిపోతుంటే శైలజ మ్యాడమ్ మాటేమో కానీ రియల్ లైఫ్ అత్తగారు అయిన సామ్ మమ్మీ ఫీలవదంటారా?