Begin typing your search above and press return to search.

వెంకీమామలో చైతన్య రోల్ అదేనట

By:  Tupaki Desk   |   17 Feb 2019 3:55 PM GMT
వెంకీమామలో చైతన్య రోల్ అదేనట
X
వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కనున్న మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో మొదలు పెట్టేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్.. చైతూలు రియల్ లైఫ్ లో ఉన్నట్టే మామ-అల్లుళ్ళుగా నటిస్తున్నారని ఇప్పటికే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇక తాజా అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో చైతు ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట. ఆర్మీ అనగానే సీరియస్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని కాదు. ఇదో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. కోన వెంకట్ ఈ సినిమాకు ఫుల్ కామెడి టచ్ ఉండే డైలాగులు అందిస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా శ్రియ.. నాగచైతన్య సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్.. కోన ఫిలిం కార్పొరేషన్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీ సినిమా 'F2' సంక్రాంతి సీజన్లో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో 'వెంకీమామ' సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.