నాగ చైతన్య ప్లాన్ బి ఇదే

Fri May 19 2017 12:04:23 GMT+0530 (IST)

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా విడుదల కావడానికి అంతా సిద్దమైంది. విడుదల వాయిదాపై కొన్ని పుకారాలు వచ్చిన నాగార్జున సాక్షిగా అన్నీ చక్కబడ్డాయి. ఈ సినిమా తరవాత నాగ చైతన్య చాలా ఆశక్తికర ఫిల్మ్ ప్రాజెక్టులు చేయనున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం ట్రెయిలర్ విడుదలైనప్పటి నుండి సినిమా గురించి అందరూ అనుకూలంగానే మాట్లాడుతున్నారు.

ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో బాగా బిజీగా ఉన్న ఈ అక్కినేని ఒక ప్రెస్ ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి అతని తదుపరి ప్రొజెక్ట్స్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇలా బదులు చెప్పాడు  “నా కెరీర్ లో నేను చేసిన సినిమాలు ఫాన్స్ నుండి నాకు దక్కిన అభిమానం లేకుంటే నేను ఎక్కడ ఉంటానో ఊహించికోవడానికే భయంగా ఉంది. గత చివరి సినిమాల నుండి నేను చాలా నేర్చుకున్న. అక్కినేని కుటంబంలో పుట్టడం నా అధృష్టం అలా అని దానిపై నేను ఆదారపడలేదు. నా కష్టాన్ని నేను నమ్ముకున్నా. నా ఫిల్మ్ కెరీర్ ఏమైనా సరిగా లేకుంటే నాకు ఇష్టమైన రెస్టారెంట్ బిజినెస్ కానీ ఆటోమొబైల్ బిజినెస్ కానీ చేసుకుంటా'' అంటూ తన ప్లాన్ బి ని తెలిపాడు నాగ చైతన్య.

చైతు రారండోయ్ వేడుక చూద్దాం తరువాత కొత్త కుర్రాడు కృష్ణ డైరక్షన్ లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాడు. ఆ తరువాత మనోడు ఏదైనా యాక్షన్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/