Begin typing your search above and press return to search.

తూచ్ అంటున్న అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   22 Feb 2018 11:18 AM GMT
తూచ్ అంటున్న అక్కినేని హీరో
X
హీరో నాగ చైతన్య ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు అంటూ రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కాగా, చైతు ఇంకో రెండు ప్రాజెక్టులకు సై అన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ అక్కినేని హీరో మాత్రం అవేం నిజం కాదు అంటూ ఖండిస్తున్నాడు.

రుమర్ల ప్రకారం చైతన్య ఓకే చెప్పిన రెండు ప్రాజెక్టులు ఒకటి శివ నిర్వాణం దర్శకత్వంలో చేస్తున్న సినిమా అందులో చై భార్య సమంత గెస్ట్ రోల్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. మరొక సినిమా సౌజన్య అనే ఒక కొత్త లేడీ డైరెక్టర్ తో చేస్తున్న సినిమా అందులో రకుల్ ప్రీత్ మళ్ళీ చై తో జత కట్టనున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అవేం నమ్మొద్దు అంటూ అక్కినేని వారసుడు ట్విట్టర్ లో తెలియచేసాడు."నా తరువాతి ప్రాజెక్టులకు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చింది. అందులో నిజంలేదు. నేను కేవలం సవ్యసాచి మరియు మారుతి గారి సినిమా మాత్రమే చేస్తున్నాడు. ఈ రెండు ప్రోజెక్టులకు చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. రెండు చాలా బాగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇంకా కొన్ని మంచి కథలు వింటున్నాను. తరువాతి సినిమా డీటెయిల్స్ త్వరలో అనౌన్స్ చేస్తాను. ఈలోపు మీరేం విన్నా అది నిజం కానే కాదు. " అంటూ ట్వీట్ చేశాడు.

మనం తర్వాత సమంత చైతన్య కలిసి మళ్ళీ మాయ చేయబోతున్నారహో అంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్న సమయంలో చై ట్వీట్ వారిలో నిరుత్సాహం నింపింది. మొత్తానికి నాగ చైతన్య మాత్రం తాను చెప్పదాకా ఏమి నమ్మొద్దు అంటూ ఫ్యాన్స్ కి ముందు జాగ్రత్తలు చెప్పేస్తున్నాడు.