శైలజా రెడ్డి అల్లుడు అక్కడున్నాడు

Sun Jan 14 2018 08:00:02 GMT+0530 (IST)

మన టాలీవుడ్ దర్శకుల్లో చాలా వరకు కొంత మంది దర్శకులను చూస్తే వీరి స్టైల్ మేకింగ్ ఎవరికి రాదు అనిపిస్తుంటుంది. వాళ్ల సినిమాలనే ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అలాంటి ఫార్మాట్ లో ఉండే దర్శకుడు మారుతి. ఈ డైరెక్టర్ సినిమాలకు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఓ వర్గం అభిమానులు మాత్రం బలే ఇష్టపడతారు. కేవలం కామెడీ ని ఇష్టపడే ఆడియెన్స్ కి మారుతి ఫుల్ మిల్స్ ఇస్తాడు అనడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.ఒక్క పాయింట్ చుట్టూ కథను అల్లడంలో మారుతి మేకింగ్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మతిమరుపు కాన్సెప్ట్ తో నానికి హిట్ ఇవ్వగా అతి శుభ్రత అనే వెరీయేషన్ తో శర్వా కి బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈగో చుట్టు కథను పొగరుగా అల్లుతున్నాడు. దాదాపు స్క్రిప్ట్ వర్క్ చివరకు వచ్చేసింది. శైలజా రెడ్డి అల్లుడు అని ఆ కథకు ముందే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశాడు. ఇక అక్కినేని నాగ చైతన్య - అను ఇమ్మన్యుయెల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే రమ్య కృష్ణ ఇందులో శైలజా రెడ్డి పాత్ర చేస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు నటీనటులు సంక్రాంతి సంబరాల్లో కొంచెం బిజీగా ఉన్నారు. ఆ వేడుకలు అయిపోగానే వెంటనే సినిమాను స్టార్ట్ చేయాలని మారుతి అనుకుంటున్నాడు. మహానుభావుడు తరువాత ఈ సినిమా వస్తుండడంతో మారుతిపై ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. మరి ఈ కామెడీ దర్శకుడు ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి అనే మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఇక రెండు సినిమాల షూటింగ్ లతో ఈ అక్కినేని హీరో బిజీ కానున్నాడు.