Begin typing your search above and press return to search.

చైతూ రిలీజ్ చేసిన థీమ్ సాంగ్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   19 Nov 2015 2:33 PM GMT


డిఫరెంట్ ప్రమోషన్స్ తో ‘శంకరాభరణం’ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేపుతోంది చిత్ర బృందం. టీజర్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకూ అన్నీ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద మంచి హైప్ వచ్చింది ఇప్పటికే. ఇక రిలీజ్ కు రెండు వారాలే టైం ఉండటంతో ఇప్పుడు మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు కోన వెంకట్ అండ్ కో.

ఇంతకుముందు టీజర్ ను పవన్ కళ్యాణ్ తో, ప్రోమో సాంగ్ ను రానా దగ్గుబాటితో రిలీజ్ చేయించి.. ఆడియో ఫంక్షన్ కు కూడా అతిరథ మహారథుల్ని రప్పించిన కోన వెంకట్.. తాజాగా ‘శంకరాభరణం’ థీమ్ సాంగ్ ను యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా లాంచ్ చేయించాడు. మండే సూర్యుడి కిరణంలాగా దూసుకు పో.. దూసుకుపో అనే పల్లవితో సాగే ఆ థీమ్ సాంగ్ సినిమా మీద మరింత ఆసక్తి పేరేలాగే ఉంది.

ఇప్పటికే ట్రైలర్లో కనిపించిన కొన్ని విజువల్స్ కి మరికొన్ని ఆసక్తికర విజువల్స్ యాడ్ చేసి.. మేకింగ్ కు సంబంధించిన కొన్ని షాట్లను కూడా జోడించి.. ఈ థీమ్ సాంగ్ తయారు చేశారు. ఐతే ఈ పాట ట్యూన్ మాత్రం ‘శంభో శివ శంభో’ టైటిల్ ట్రాక్ ను తలపిస్తోంది. నిఖిల్ - నందిత జంటగా నటించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనం దర్శకత్వం వహించగా.. కోన వెంకట్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. అతను నిర్మాణ భాగస్వామి కూడా. డిసెంబరు 4న ‘శంకరాభరణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.