బంగార్రాజుపై క్లారిటీ ఇచ్చేసిన చైతు

Sat Apr 13 2019 22:12:17 GMT+0530 (IST)

'దేవదాస్' తర్వాత తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అక్కినేని నాగార్జున మళ్ళీ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు.  ఇప్పటికే 'మన్మధుడు 2' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటుగా 'బంగార్రాజు' ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'బంగార్రాజు'ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ ను పకడ్బందీగా తీర్చి దిద్దుతున్నాడట.  మొదట ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ చైతు నటించడం లేదని.. చైతు పాత్రలో తమ్ముడు అఖిల్ నటిస్తాడని రీసెంట్ గా ఫిలిం నగర్లో టాక్ వినిపించింది.  ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూ లో చైతు స్పందిస్తూ.."బంగార్రాజులో నాన్నగారితో పాటు నేను నటిస్తున్నాను" అంటూ క్లారిటీ ఇచ్చాడు.  

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చెప్పిన చైతు.. హీరోయిన్స్ ను త్వరలో ఫైనలైజ్ చేసి వాళ్ళ పేర్లు ప్రకటిస్తామని తెలిపాడు. సో.. ఈలెక్కన 'బంగార్రాజు' లో అఖిల్ నటిస్తాడనే వార్తలు ఫుల్ స్టాప్ పెట్టినట్టే.  ఒకవేళ నటించినా ఏదో క్యామియోలాగా తప్ప కీలకపాత్ర మాత్రం కాదు.  'బంగార్రాజు' లో నాగార్జున.. చైతులే హీరోలు!