Begin typing your search above and press return to search.

చైతూ-సమంత ఇరుకున పడ్డారే..

By:  Tupaki Desk   |   23 Feb 2017 10:04 AM GMT
చైతూ-సమంత ఇరుకున పడ్డారే..
X
ముందు అనుకున్న ప్రకారమైతే ఈపాటికి అక్కినేని నాగచైతన్య-సమంత రూత్ ప్రభుల నిశ్చితార్థం ఇప్పటికే పూర్తి కావాల్సింది కాదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎంగేజ్మెంట్ చేసుకుని.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్నట్లుగా ఇంతకుముందు వార్తలొచ్చాయి. చైతూ.. సమంత కూడా ఈ తరహాలోనే మాట్లాడారు. కానీ పెద్దల ఒత్తిడి మేరకో ఏమో.. ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. పెళ్లి కొంచెం లేటుగా చేసుకుందాంలే అనుకున్నారు. కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ సాధ్యమైనంత త్వరగా వీరి పెళ్లి కానిచ్చేద్దామని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అఖిల్-శ్రియ భూపాల్ ల ఎంగేజ్మెంట్ రద్దు అయినట్లు దాదాపుగా కన్ఫమ్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడందరి ఫోకస్ చైతూ-సమంతల మీద పడింది. వీరి బంధం వేరన్న సంగతి అర్థమవుతున్నా.. అఖిల్ విషయంలో జరిగింది చూసి వీరి వైపు కూడా జనాలు అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. దీంతో వీళ్లు సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలన్న ప్రెజర్ ఎదుర్కొంటున్నారు. నాగ్ ఆలోచన కూడా అలాగే ఉందట. పెళ్లి సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా చేసుకోవాలని చైతూ.. సమంత అనుకున్నారు కానీ.. ఇప్పుడు అలా కుదిరేట్లు లేదు. ఈ పెళ్లిని గ్రాండ్ గా చేసి.. అఖిల్ ఉదంతాన్ని అందరూ మరిచిపోయేలా చేయొచ్చని అక్కినేని కుటుంబం భావిస్తున్నట్లు సమాచారం. అఖిల్ పెళ్లి అనుకున్న సమయానికే చైతూ-సామ్ పెళ్లి అయిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తానికి అఖిల్-శ్రియ వ్యవహారంతో చైతూ-సమంత ప్రెజర్లో పడిపోయారిప్పుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/