Begin typing your search above and press return to search.

చై.. సమంత.. ఓ కుక్క పిల్ల

By:  Tupaki Desk   |   20 Feb 2017 5:35 AM GMT
చై.. సమంత.. ఓ కుక్క పిల్ల
X
వీకెండ్స్ కోసం బోలెడన్ని ప్లానింగ్స్ వేసేసుకోవాలి. అదే ఆదివారం కోసం అయితే.. అబ్బా ప్లానింగ్ తోనే విసుకు వచ్చేస్తుంది. కానీ సౌత్ బ్యూటీ సమంత ఈ సండే ఎలా గడిపేసిందో తెలుసా? తెలిస్తే మాత్రం ఇదీ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ ప్లానింగ్ అంటే అనాల్సిందే.

రియల్ లైఫ్ సెలబ్రిటీ లవ్ స్టోరీలలో ఓ బెంచ్ మార్క్ సృష్టించే రేంజ్ లో కథ నడిపించారు అక్కినేని నాగచైతన్య-సమంత. ఇప్పటికే నిశ్చితార్ధం కూడా పూర్తి చేసుకున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుని ఒక కాబోతోన్నారు. ఈ ఆదివారం మొత్తం తన కాబోయే బెటరాఫ్ కి కేటాయించేసుకున్నారు వీరిద్దరు. చైతుతో కలిసి.. ఆదివారం ఎంజాయ్ చేశానంటూ.. సమంత తెగ గొప్పలు పోతోందిలే. అంతేనా.. 'ఆదివారాలు పర్ఫెక్ట్ గా ఉండాలి బాబూ' అంటూ సలహాలు కూడా ఇస్తోంది.

పక్కన కోరుకున్న ప్రియుడు.. కాబోయే భర్త ఉంటే.. ఏ అమ్మాయి ఫేస్ లో అయినా హుషారు తన్నుకొచ్చేస్తుంది. ఆ ఆనందం శామ్ ఫేస్ లో కనిపించేస్తోంది. అంతే కాకుండా సమంత తన క్యూట్ కుక్క పిల్లతో కలిసి ఎంజాయ్ చేస్తున్న క్షణాలను.. వెనక కుర్చీలో కూర్చుని ముచ్చటగా తిలకిస్తున్నాడు చైతు. నిశ్చితార్ధం తర్వాత కాసింత ఓపెన్ గా రన్ అవుతున్న ఈ లవ్ స్టోరీకి.. త్వరలో పెళ్లి కార్డు పడనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/