#చైశామ్.. ఆల్వేస్ న్యూ జోడి

Mon Jun 25 2018 21:02:34 GMT+0530 (IST)


టాలీవుడ్ లో ప్రస్తుతం బెస్ట్ స్టార్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని వారి జోడి అనే చెప్పాలి. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇలాంటి స్టార్ జంట ప్రస్తుతం లేదు. ఇద్దరు ఒక సరైన వయసులో పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ తో పాటు కెరీర్ ను కూడా చాలా హ్యాపీగా కొనసాగిస్తున్నారు.మ్యారేజ్ చేసుకుంటే అంతా మారిపోతుందని ఇప్పుడు కొంత మంది భయపడుతున్నారు.బ్యాచులర్ లైఫ్ ఒక ఏజ్ వరకు బాగానే ఉంటుంది. కానీ లిమిట్ దాటితే ఏదోలా ఉంటుంది.  #చైశామ్ లైఫ్ ను చాలా బ్యాలెన్సీడ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల నాగ చైతన్య అండ్ సమంత ఒక యాడ్ లో పాల్గొన్నారు. అందుకు సంబందించిన ఫొటోలు అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. ఈ జోడి ఇది వరకే బిగ్ బజార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే అందులో భాగంగా చాలా రోజుల తరువాత ఈ ఇద్దరు ఒక యాడ్ లో పాల్గొన్నారు. చీరలో సమంత నాగ చైతన్య వైపుకు చూస్తు ఒక స్మైల్ ఇస్తున్నట్లు ఇచ్చిన స్టిల్ క్యూట్ గా ఉంది. ఇక నాగ చైతన్య అయితే చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. పెళ్లి జరిగి ఏడాది కావస్తున్నా కూడా ఇంకా ఈ జంటను చూస్తున్న ప్రతి సారి కొత్తగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.