Begin typing your search above and press return to search.

మామయ్యతో సినిమా.. సెట్టయ్యిందా?

By:  Tupaki Desk   |   17 March 2018 5:57 AM GMT
మామయ్యతో సినిమా.. సెట్టయ్యిందా?
X
ప్రస్తుత రోజుల్లో కొంత మంది వారసులు సొంత బ్యానర్ లో కంటే పక్క ప్రొడక్షన్ లోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను ఓ లెవెల్ లో తీసుకువెళుతోన్న అక్కినేని హీరో నాగ చైతన్య కూడా తన ఫ్యామిలీ ప్రొడక్షన్ లలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు సొంత బ్యానర్ అన్నపూర్ణ ఎలాగూ ఉంది. సపోర్టింగ్ గా మేన మామ సురేష్ ప్రొడక్షన్ కూడా ఉంది.

కానీ నాగ చైతన్య అన్నపూర్ణ ప్రొడక్షన్ లో బాగానే చేశాడు గాని మామయ్య ప్రొడక్షన్ లో మాత్రం ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు. చాలా కాలంగా సురేష్ బాబు చర్చలు జరుపుతున్నా కూడా ఎదో ఒక కారణంగా ఆ కాంబినేషన్ కుదరడం లేదు. అసలైతే సవ్యాసాచి సురేష్ బాబే నిర్మించాలి. కానీ చివరి నిమిషంలో దర్శకుడి కారణంగా మైత్రి మూవీ మేకర్స్ వారి చేతుల్లోకి వెళ్లిందని టాక్. అది కూడా పెద్ద బ్యానర్ కావడంతో నాగ్ కూడా ఏమనలేదు.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ - నాగచైతన్య మల్టి స్టారర్ అనుకున్నారు కానీ అది కూడా మిస్ అయ్యింది. అయితే ఈ సారి ఎలాగైనా మేనల్లుడితో సినిమా చేయాలనీ సురేష్ బాబు ఫిక్స్ అయ్యారు. మరో ప్రొడక్షన్ తో కలిసి సురేష్ బాబు సినిమాను నిర్మించడానికి సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ చెప్పిన కథ నాగ చైతన్య కు సెట్ అవుతుందని అదే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.