సమంత ఇల్లు హౌస్ ఫుల్లయ్యిందట

Sun Aug 13 2017 23:03:37 GMT+0530 (IST)

ఇప్పుడు నాగ చైతన్య అండ్ సమంత గురించి ఓ చిన్న అప్డేట్ అయినా కూడా అభిమానులను భలే ఖుషీ చేస్తోంది. అసలు తెలుగులో ఈ మధ్య కాలంలో ప్రేమించుకుని పెళ్ళి చేసుకుంటున్న  స్టార్ హీరో అండ్ హీరోయిన్ వీరు. కాబట్టి ఆమాత్రం క్రేజ్ ఉండదేంటి మరి. ఇకపోతే ఇప్పుడు సమంత తరుపున అవార్డు తీసుకోవడానికి వచ్చిన చై.. భలేగా తన మాటలతో ఆకట్టుకుంటున్నాడు.ఆదివారం సాయంత్రం హైదరాబాదులో ఏర్పాటు చేసిన సంతోషం అవార్డుల కార్యక్రమంలో సమంతకు ''అ.ఆ'' సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఈ ట్రోఫీ తీసుకోవడానికి సమంత బదులుగా నాగ చైతన్య వచ్చాడు. అల్లు అరవింద్ దగ్గర నుండి ట్రోఫీ అందుకున్నాడు. ఆ సమయంలో మాట్లాడుతూ.. ఇప్పటికే సమంతకు ఇల్లంతా అవార్డులే. హౌస్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రోఫీ కూడా అక్కడికే చేరుతుంది.. అంటూ చలాకీగా చెప్పాడు. నిజమే కదా.. సమంత ఫిలింఫేర్లు అవీ ఇవీ చాలానే అవార్డులను గెలిచింది. ఎక్కువ ట్రోఫీలే ఉండుంటాయ్. అవన్నీ చూసి చెయ్ కూడా చాలా హ్యాపీ ఫీలవుతున్నట్లున్నాడు.

ఇకపోతే వచ్చే అక్టోబర్ 6న గోవాలోని డబ్ల్యూ హోటల్లో సమంత అండ్ చైతన్యల పెళ్ళి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యన జరగనుంది. మరి హైదారాబాద్ వచ్చాక రిసప్షన్ ఏమన్నా ఇస్తారేమో తెలియదు కాని.. పెళ్ళయిన మూడో రోజునే ఇద్దరూ షూటింగుకు వెల్ళిపోనున్నారు. అది సంగతి.