అక్కినేని వెడ్డింగులో అసలైన ఆత్మీయులు

Wed Sep 13 2017 05:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ ప్రేమ జంటగా పేరుపొందిన హీరో నాగ చైతన్య మరియు సమంత. మరి కొద్ది రోజుల్లో వీరు ఒక్కటి కాబోతున్న  సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లికొసం ఎప్పుడో ప్లాన్స్ వేసేసుకున్నారు. గోవాలో ఇరు సంప్రదాయాల పద్ధతుల్లో రెండు సార్లు ఈ ప్రేమ జంట ఒక్కటికాబోతోంది. ఎప్పుడు ఎవ్వరు పెళ్లి చేసుకొని విధంగా వీరిద్దరూ పెళ్లి బంధం ఒకటవుతుండడంతో టాలీవుడ్ మొత్తం ఈ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ అద్భుత వివాహానికి కొందరు దగ్గరి బంధువులు మాత్రమే రాబోతున్నారట. ఇక రిసెప్షన్ ని హైదరాబాద్ లో నిర్వహించి  నాగ్ టాలీవుడ్ ప్రముఖులందరిని పిలవనున్నడట. అయితే చైతు పర్సనల్ గా కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఇన్విటేషన్స్ ఇస్తున్నాడని టాక్. ఇక టాలీవుడ్ హీరోల్లో రానా చైతూకి బాగా క్లోజ్. అలాగే ఇద్దరు దగ్గరి బందువులే కాబట్టి రానా డౌట్ లేకుండా వస్తాడు. ఇక ఎన్టీఆర్ కూడా చైతూకి చాలా క్లోజ్. నాగ్ కూడా ఎన్టీఆర్ ని చాలా ఇష్టపడతారు. సో ఎన్టీఆర్ కి స్పెషల్ ఇన్విటేషన్ దక్కేటట్లు ఉందని తెలుస్తోంది. చైతూకి నితిన్ అండ్ శిరీష్ కూడా బాగానే టచ్ లో ఉంటారు. వీరు అప్పుడపుడూ లాంగ్ డ్రైవింగ్ లకు కూడా వెళతారు. మరి వీరిని గోవాకు చైతూ పిలుస్తాడో లేదో చూడాలి. అలాగే నాగ్ తరుపున చిరంజీవి.. అల్లు అరవింద్.. నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు వచ్చే ఛాన్సుంది.

ఇక సమంత తరపునుండి మాత్రం తన క్లోజ్ ఫ్రెండ్స్ మరియు దగ్గరి బందువులు హాజరుకానున్నారట. ఇప్పటికే ఫ్రెండ్స్ కి గట్టిగా వర్నింగ్ ఇచ్చేసిందట ఏ మాత్రం మిస్ అవ్వొద్దని. ఇక తన పర్సనల్ స్టైలిస్ట్ నీరాజా కోన ని కూడా సమంత పిలవనుందట. అలాగే తన సినిమాలకి ఎప్పటి నుండో డబ్బింగ్ చెబుతున్న సింగర్ చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కు కూడా స్పెషల్ గా ఇన్విటేషన్ ను ఇచ్చేసిందట.

మొత్తానికి అక్కినేని వారి పెళ్లి వేడుక అంతా సెట్ అయిపోయింది. ఇక వేడుకలో ఎవరు పాల్గొంటారో వారే అసలైన అక్కినేని ఆత్మీయులు అని చెప్పవచ్చు. చూద్దాం ఎవరెవరు వస్తారో.. వెయిట్ అండ్ సి. అక్టోబర్ 6 అండ్ 7న గోవాలో హిందూ అండ్ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్ళి జరగనుంది.