Begin typing your search above and press return to search.

చెయ్.. రకుల్.. చెత్త కోసం నవ్వలేదు

By:  Tupaki Desk   |   23 May 2017 10:08 AM GMT
చెయ్.. రకుల్.. చెత్త కోసం నవ్వలేదు
X
ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగానే ఏది వైరల్ ఏది రియల్ అనేది అర్ధంకావట్లేదు. నిజానికి లైవ్ టెలికాస్ట్ సంగతేమో తెలియదు కాని.. 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో లాంచ్ లో యాంకర్ వెళ్ళి చలపతిరావును అమ్మాయిలు హానికరం అనే క్యాప్షన్ పై స్పందిస్తూ.. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అంటూ కామెంట్ చేశాడు. అది వినగానే అక్కడున్న చాలామంది నవ్వేశారు. అందులో చైతన్య అండ్ రకుల్ కూడా ఉన్నారా?

నిజానికి కొన్ని వీడియోలలో చూస్తుంటే.. చలపతిరావు కామెంట్ చేయగానే వెంటనే నాగ చైతన్య అండ్ రకుల్ పకపకా నవ్వేసినట్లు వచ్చేసింది. అయితే అక్కడ యాంకర్ రవి ఒక్కడే 'సూపర్ సార్' అంటూ కామెంట్ చేశాడు కాని.. మిగిలినోళ్ళు మాత్రం ముక్కున వేలేసుకున్నారు. దీని గురించి నాగచైతన్య స్పందిస్తూ.. ''అమ్మాయిలను గౌరవించడం అనేది నా జీవితంలో భాగం. టివిల్లో ఆ కామెంట్ తరువాత వచ్చిన రియాక్షన్లకూ ఆ స్టేట్మెంట్ కు సంబంధం లేదు. వాటితో నేను ఏకీభవిస్తానా? నో వే'' అనేశాడు చైతన్య.

ఇక రకుల్ ప్రీత్ స్పందిస్తూ.. ''టెలికాస్ట్ లో ల్యాగ్ ఉండటం కారణంగా.. ఆ కామెంట్ల వెనుకే మేం నవ్వినట్లు వచ్చింది. కాని నిజానికి అలా జరగలేదు'' అంటూ తనవంతుగా క్లారిటీ ఇచ్చేసింది. పొద్దున్న నాగ్.. ఇప్పుడు.. వీరిద్దరూ.. క్లారిటీల మీద క్లారిటీలు ఇస్తూ.. చలపతి కామెంట్ల ద్వారా ''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాకు భలే పబ్లిసిటీ కలిపిస్తోంది.