Begin typing your search above and press return to search.

చైతు బాక్స్ ఆఫీస్ యుద్ధం పక్కా

By:  Tupaki Desk   |   17 Aug 2017 6:41 AM GMT
చైతు బాక్స్ ఆఫీస్ యుద్ధం పక్కా
X
అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో మంచి ఊపు మీద ఉన్నాడు. కెరీర్ మొదట్లో కాస్త వెనుకడుగువేసినా ఆ తర్వాత లవ్ స్టోరీస్ తో మెల్లగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగా దగ్గరయిపోయాడు. అయితే ఇప్పటివరకు ఓ కమర్షియల్ సినిమాలతో తన టాలెంట్ ను చూపించిన చైతు ఈ సారి తన స్టైల్ ను పూర్తిగా మార్చేసి ఒక కొత్త తరహా చిత్రంతో రాబోతున్నాడు.

అదే "యుద్ధం శరణం" టైటిల్ తోనే యాక్షన్ ప్రేమికులను ఆకట్టుకున్న చైతు. ఈ సినిమాలో తన ఇమేజ్ ను కూడా పక్కనబెట్టి ఒక వైవిధ్యమైన పాత్రతో రాబోతున్నాడు. ఇప్పటికే ట్రైలర్ తో దుమ్ములేపిన చైతు ఈ సినిమాతో మారో స్థాయికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. చైతు ఈ సినిమా కోసం చాలా కస్టపడుతున్నాడట. యాక్షన్-థ్రిల్లర్ కథాంశంతో తమిళ దర్శకుడు కృష్ణ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో నాగ చైతన్య లుక్స్ కూడా బావున్నాయి అనే కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుందట. స్క్రీన్ ప్లే మరియు కథలో ట్విస్ట్ లతో పాటు లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట.

దాదాపు షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 8న రిలీజ్ చేయడానికి నిర్మాత సాయి కొర్రపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చైతు సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ప్రతి నాయకుడి పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.